సుప్రింకోర్టులో కేసు వేస్తామన్న బొమ్మ
x
TPCC President Bomma Mahesh Kumar Goud

సుప్రింకోర్టులో కేసు వేస్తామన్న బొమ్మ

రిజర్వేషన్ల అమలుపై ప్రతిపక్షాల ఆరోపణలకు భయపడేదిలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్దిని అందరు గమనిస్తున్నట్లు చెప్పారు


బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకోసం సుప్రింకోర్టులో ప్రభుత్వం కేసు దాఖలు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతు రిజర్వేషన్ల అమలుపై ప్రతిపక్షాల ఆరోపణలకు భయపడేదిలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్దిని అందరు గమనిస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అమలుకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేస్తుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈవిషయంలో వెనక్కు తగ్గేదిలేదని స్పష్టంచేశారు. బిల్లులు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉన్నపుడు వాటిని క్లియర్ చేయించటంలో బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) దగ్గరకు ఎందుకు వెళ్ళటంలేదని నిలదీశారు.

బీసీ సంఘాల బంద్ పిలుపుకు కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు. బీసీ సంఘాలు ధర్నాలు చేసినపుడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. బీజేపీకి నరనరాల బీసీలపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లుగా తెలిసిపోయిందన్నారు. అలాంటి బీజేపీకి బీఆర్ఎస్ కూడా తోడైందని మండిపడ్డారు.

యూపీఏ హయాంలో చారిత్రక చట్టాలు అమల్లోకి వచ్చిన విషయాన్ని బొమ్మ గుర్తుచేశారు. సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, కనీస వేతనాల చట్టం లాంటి అనేక చట్టాలను యూపీఏ ప్రభుత్వమే చేసిందన్నారు. అదే తరహాలోనే రేవంత్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ చట్టం చేసిందని తెలిపారు. అయితే కొన్ని దుర్మార్గమైన కారణాల వల్ల హైకోర్టు జీవో ఎంఎస్ 9 అమలుపై స్టే విధించినట్లు చెప్పారు. ఈ స్టేని తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు దాఖలుచేయబోతున్నట్లు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.

Read More
Next Story