భక్తులతో కిటకిటలాడిన  గోల్కొండ జగదాంబ దేవాలయం
x

భక్తులతో కిటకిటలాడిన గోల్కొండ జగదాంబ దేవాలయం

రెండో గురువారం పోటెత్తిన భక్తులు


తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాలు వేడుకలు హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత గురువారం చారిత్రాత్మ గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయంలో వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే హైదరాబాద్ నగరంలో ఆశాడమాస బోనాల వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. మిగతా జిల్లాల్లో శ్రావణ మాసంలో బోనాల వేడుకలు జరుగుతాయి.

కాగా గురువారం రెండో గురువారం సందర్బంగా గోల్కొండ అమ్మవారికి భక్తుల తాకిడి పెరిగింది. నెల రోజుల పాటు జరిగే హైద్రాబాద్ బోనాలు చివరి బోనంతో గోల్కొండలో ముగుస్తాయి. గోల్కొండ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం బంగారు బోనంతో మొక్కులు సమర్పించుకుంది.

తెల్లవారు జామునుంచి భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడంతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారికి ఒడిబియ్యం, సాక, బెల్లం, తొట్టెలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు గోల్కొండ కోట ప్రాంగణంలో వంట చేసుకుని భోజనాలు.

బోనాలు అంటే భోజనాలు

బోనాలు వేడుకల్లో భోజనాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. బోనం అంటే భోజనం. అమ్మవారికి నైవేద్యం సమర్పించడం. తమను

తెల్లవారు జామునే మాతృమూర్తులు మట్టి కుండలో పాలు, బెల్లం కలిపి వండిన అన్నం, వేపాకులు, పసుపు లతో మట్టికుండను అలంకరిస్తారు. మహిళలు తమ తలపై ఈ కుండలను మోస్తూ ఆలయాల వద్ద అమ్మవారికి చీరలతో బోనం సమర్పిస్తారు.

బోనాలు డప్పు చప్పుళ్లు, డోలు మోతలు, పోతరాజుల విన్యాసాల మధ్య వేడుకలు జరిగాయి.

Read More
Next Story