
రవీంద్ర భారతిలో మూడు పుస్తకాల ఆవిష్కరణ
"తెలంగాణ లో బిసి ఉద్యమం విస్మరించవీలులేని వాస్తవం, అది కొనసాగుతుంది."
శనివారం రవీంద్ర భారతి మినీ హాల్ లో ఉదయము 11 గంటలకు ఒక సాహిత్య సభలో మూడు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది, బిట్ల నారాయణ స్వీయ చరిత్ర " నా అంతరంగ తరంగాలు' పునర్ముద్రణను ఆయన జయంతి ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ కోర్ కమిటీ సభ్యులు, తెలంగాణ పద్మశాలి సంఘం వైస్ చైర్మన్ కర్నాటి కర్నాటి మనోహర్ ఆవిష్కరించారు
కరీం రాసిన ‘మార్గదర్శి బి.ఎస్ రాములు జీవిత ప్రస్థానం’ పుస్తక రచయిత కరీం పుస్తకాన్నికస్తూరి సతీష్ కుమార్ (సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు) ఆవిష్కరించారు
ఐఎఎస్ అధికారి టి చిరంజీవులు రాసిన ‘ఇస్సా ఇజ్జత్ హుకుమత్: బీసీ రాజ్యాధికార సిద్ధాంతం’ ను ప్రముఖ రచయిత బిఎస్ రాములు ఆవిష్కరించారు.
సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి నామోజు బాలా చారి గారు మాట్లాడుతూ, బిఎస్ రాములు బీసీల లలోని అత్యంత వెనుకబడిన వర్గాల కోసం వారి ఉన్నతికై ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. బీసీ కమిషన్ చైర్మన్ గా రాములు చేసిన కృషి అనన్యమైనదని చెబుతూ ఆయన సేవలు నిక్షిప్తం చేసి భావితరాలకు మనం తెలియజేయాలని అన్నారు.
‘నేటి నిజం’ ఎడిటర్ బైస దేవదాస్ మాట్లాడుతూ బిఎస్ రాములే ఒక గ్రంథం అని బీడీలు చుట్టుకునే కుటుంబం నుంచి వచ్చిన బిఎస్ రాములు గారు కమిషన్ బిసి కమిషన్ చైర్మన్గా ఎదిగారని పుస్తకంలోని ప్రతి అక్షరం ఆయన ఎదుగుదలకు సాక్ష్యం అని అన్నారు.
ప్రజల కోసం సమస్యల పరిష్కారం కోసం ఎంతో పాటుపడిన ఆయన జీవిత చరిత్రను చదివితే భవితరాలను మనము తీర్చుకో తీర్చిదిద్దుకోగలుగుతామని అంటూ ఈ చరిత్రను చదివితే మన ఆలోచన పరిధి పెరుగుతుందని చెప్పారు.
ప్రముఖ సాహితీ వేత్త సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘నా అంతరంగ తరంగాలు’ గురించి వివరించారు. ‘నా అంతరంగ తరంగాలు’ లో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి 1998 వరకు బిట్ల నారాయణ జీవిత చరిత్ర నమోదయింది అన్నారు. సుద్దాల హనుమంతుతో బాంబేలో అజ్ఞాత జీవితం గడిపిన అనుభవం గొప్పగా ఉందని శ్రీనివాస్ అన్నారు.
మార్గదర్శి బిఎస్ రాములు విస్తృతమైన జీవిత చరిత్ర ఆయన దేశ సంచారం, ధరకమే ఐక్యవేదిక ఏర్పాటు చేసిన విధానం బీసీ దళితులను కలిపేందుకు ఆయన పునాది వేసిన తీరును కరీం గొప్పగా అక్షరీకరించారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత స్థాయికి తీసుకు వెళ్లిన వాళ్లలో బిఎస్ రాములు ఒకరని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతినెల ఒక సంచికను తీసుకురావడం బిఎస్ కె సాధ్యమైంది అన్నారు.
ఇక తెలంగాణలో ప్రస్తుతం బీసీ ఉద్యమం ఒక విస్మరించలేని వాస్తవమని, అనివార్యమని ‘ఇస్తా ఇజ్జత్ హుకుమత్’ చిరంజీవి ఎంతో గొప్పగా చెప్పారని శ్రీనివాస్ చెప్పారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సాక్ష్యాధారాలతో ఆయన మన ముందుకు ఈ పుస్తకంలో ఉంచిన తీరు గొప్పగా ఉందని అన్నారు
కర్నాటి మనోహర్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం గల్లి నుంచి ఢిల్లీ దాకా పోరాడుతున్న పోరాటంసాగుతందని, బీసీలంతా ఒక్కటై 42% రిజర్వేషన్ పొందే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కస్తూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ, బిఎస్ రాములు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.
‘ఉద్యమ కాలంలో ఆయనను చూసింది మేము చాలా తక్కువ. వ్యక్తిగత జీవితానికి ఎన్నో సంవత్సరాలు దూరమై సమాజం కోసం పాటుపడిన త్యాగపూరితమైన జీవితం ఆయనది. ఆయన గొప్పతనాన్ని తత్వాన్ని నేను ఎదుగుతున్న క్రమంలో అర్థం చేసుకోవడం జరిగింది. బిఎస్ జీవితం భావితరాలకు మార్గదర్శకం,’ అని అన్నారు. బి ఎస్ రాములు గారి జీవితాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మాజీ ఐఎఎస్ అధిరాకి చిరంజీవులు మాట్లాడుతూ బిఎస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రతి ఆటుపోటును అవకాశంగా మార్చుకున్నారు, అసమానుడిగా ఎదిగారని ప్రశంసించారు. బిఎస్ ఒక నిఘంటువు ఒక ఎన్ సైక్లోపీడియా
బీసీలు సాధికారత కోసం ఉద్యమించాలి రాయితీలపై కాదు రాజ్యాధికారంతో బతకాలి రాజ్యాధికారం లేనప్పుడు సమాజంలో ఉన్న ఒకటే సమాధిలో ఉన్న ఒకటే పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసినట్టు చేనేత కార్మికులకు ఒక రూపాయి అయినా రుణమాఫీ చేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను బీసీల రిజర్వేషన్ ప్రకారము వారికి రావలసిన మాట వారికి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమే నేను ఈ సంకలనాన్ని తీసుకురావడం జరిగింది అన్నారు
సభలో ఇంకా ప్రజాకవి జయరాజు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రచయిత్రి జూపాక సభద్ర, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు,హైకోర్టు అడ్వకేట్ వనం దుశ్శంతల కూడా ప్రసంగించారు.
Next Story

