
Hussain Sagar Boat Fire | హుస్సేన్ సాగర్ బోట్లలో భారీ అగ్ని ప్రమాదం
.బాణసంచా పేలి బోట్లలో మంటలు రాజుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డట్లు సమాచారం.
హైదరాబాద్ నగరం నెక్లెస్ రోడ్ లోని హుస్సేన్ సాగర్ లో ఆదివారం రాత్రి రెండు బోట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.పడవల్లో ఉంచిన బాణాసంచా పేలుడికి ఒక్కసారిగా రెండు బోట్లలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. ఒక్క బోటులో రాజుకున్న మంటలు రెండో బోటుకు కూడా వ్యాపించాయి.
అనంతరం , బాణ సంచా పేల్చే కార్యక్రమం ఉంది. అయితే, ఒక బోటులో ఉంచిన బాణ సంచాకు నిప్పంటుకుంది. ఈ అగ్నిప్రమాదంలో రెండు బోట్లు కాలి బూడిదగా మారాయి. - ఒక్కసారిగా మంటలు వ్యాపించి బోట్లు కాలి పోయాయని సమాచారం. ఈ అగ్నిప్రమాదం వల్ల బోట్లలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. అసమయంలో బోట్లో పదహైదు మంది దాకా ఉన్నారని, వాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిసింది. ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పేలుడు కు ముందు జరిగిన హారతి కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బీజేపీ ఎంపీలు, ప్రముఖులు పాల్గన్నారు. ఏడేళ్లుగా భరతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. నగరంలోని సెక్రటేరిట్ భవనం విద్యుద్దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోయింది