CM Revanth Reddy
x

‘రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు’

కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి‌దే. కిషన్ రెడ్డి సాధించుకుని వస్తే ఆయనకు బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తానని రేవంత్ తెలిపారు.


సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. కాగా ఈ భేటీ గురించి సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో చిట్ చాట్ చేశాడు. ప్రధాని మోదీకి పలు అంశాలపై విజ్ఞప్తులు అందజేశామని, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధానితో ముఖ్యంగా ఐదు అంశాలపై చర్చించానని, వాటికి సంబంధించి వినతులు కూడా అందిచానని రేవంత్ వివరించారు. మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్ , ఏసీఎస్ కేడర్ల పెంపు అంశాలపై పీఎంకి వినతులు ఇచ్చినట్లు చెప్పారు.

‘‘ప్రధానికి ఇవ్వాల్సిన విజ్ఞప్తులు ఇచ్చాను. బాధ్యత వహించి వాటిని తీసుకురావాల్సింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లే. రాష్ట్రం తరఫున ఇచ్చిన విజ్ఞప్తులకు, కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి‌దే. కిషన్ రెడ్డి సాధించుకుని వస్తే ఆయనకు బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తాం. ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. ప్రధానమంత్రి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐదు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం తరఫున విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించిన రిప్రెజెంటేషన్ ప్రధాని నాకు ఇచ్చారు’’ అని తెలిపారు.

‘‘2014 నుంచి 2024 వరకు రాజ్యాంగం మారలేదు. గత పదిఏళ్ల నుంచి శాసనం మారలేదు. గత పది ఏళ్లలో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి. లెజిస్టేచర్ పార్టీ విలీనం అనేది లేదు. పార్టీనే సుప్రీమ్. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై సిబిఐ విచారణ వేస్తే.. ఆ వంకతో బిజెపిలో కలిసిపోవచ్చు అనుకుంటున్నారు’’ అని అన్నారు.

Read More
Next Story