
నీటి గుంటలో పడి అక్కా తమ్ముడు మృతి
ఆదిలాబాద్ లో విషాదం
నీటి గుంటలో పడి అక్కా తమ్ముడు చనిపోయిన ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. మావల పరిధిలోని గ్రీన్ సిటీ సమీపంలో అక్క విన్నూత్న (11) తమ్ముడు విదాత (9)సైకిళ్లు నడుపుకుంటూ వెళ్లే సమయంలో పక్కనే ఉన్న నీటి గుంటలో పడ్డారు. వారి డెడ్ బాడీలను వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి పంపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో విలపిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ ప్రమాద స్థలాల దగ్గరికి వెళ్లకుండా చేయగలిగితే ఇటువంటివి నివారించవచ్చు. వారి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుంది.
Next Story