రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
x

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

దసరా సందర్బంగా అమ్మమ్మ ఇంటికి వచ్చి...


సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మితి మీరిన వేగంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు అదుపుతప్పి పడిపోయారు. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన వేముల నాగ రాజు(26), వేముల కార్తిక్ (24) దసరా పండుగ సందర్బంగా అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామమైన మాలిపురం బయలు దేరుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నాగరాజు హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. దసరా పండుగ మరుసటి రోజు రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తిరిగి రాని లోకలకు చేరుకోవడంతో మాలిపురంలో విషాద చాయలు నెలకొన్నాయి.

Read More
Next Story