తెలంగాణ నలుమూలల నుంచి కదిలిన గులాబీ దండు
x
అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న కేటీఆర్

తెలంగాణ నలుమూలల నుంచి కదిలిన గులాబీ దండు

తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి గులాబీ దండు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు కదిలింది. గులాబీ రంగు జెండాలు రెపరెపలతో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.


హన్మకొండ మండలం ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు గులాబీ జెండాలు పట్టుకొని తరలివచ్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన కార్యకర్తలతో కలిసి బస్సు టాప్ పై నిలబడి సభకు వచ్చారు.

- గులాబీ జెండాల రెపరెపలతో గులాబీ రంగు అంబాసిడరు కార్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.

- శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద తన పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాస్ సాంగ్ కు డాన్స్ చేశారు. మల్లారెడ్డి చేసిన డాన్స్ కు కార్యకర్తలు ఈలలు వేశారు.

- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎల్కతుర్తి సభకు వెళ్లేముందు ట్యాంక్ బండుపై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరుల స్షూపం వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించారు.
- జనగామలో కేటీఆర్ కు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికి గజమాలతో స్వాగతం పలికారు. తన క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ భోజనం చేసి ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరారు.
- రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, కార్లు, ఎడ్లబండ్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలు చేతబట్టి ఎల్కతుర్తి సభకు తరలివచ్చారు.
- గులాబీ జెండాల రెపరెపలతో వరంగల్ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. గొడుగులతో కొందరు కార్యకర్తలు సభకు తరలివచ్చారు.
- ఎల్కతుర్తి సభా ప్రాంగళం గులాబీ జెండాల రెపరెపలు, కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో కళకళలాడింది.



Read More
Next Story