బండెనక బండి కట్టి బయలెల్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు
x
బీఆర్ఎస్ సభకు బీఆర్ఎస్ దండు

బండెనక బండి కట్టి బయలెల్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు

బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందడి ఆదివారం ఉదయం నుంచే మొదలైంది.బండేనక బండి కట్టి బయలెల్లి పోదాం రారో కేసీఆరు సభకు అంటూ ఎడ్లబండిపై బీఆర్ఎస్ సభకు తరలివస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రీయ సమితి ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా భారీ రజతోత్సవ సభను హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలోని ఆదివారం 4 గంటలకు నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న నేపథ్యంలో అందరి చూపు ఆయన సభపై పడింది.




‘‘బండెనక బండి కట్టి బయలెల్లి పోదాం రారో కేసీఆరు సభకు’’ అంటూ గులాబీ సైనికులు తెలంగాణ నలుమూలల నుంచి ఆదివారం ఉదయాన్నే ఎడ్లబండ్లపై బయలు దేరారు. తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా గులాబీ దండు గులాబీ గర్జనకు తరలివెళుతుండటం కనిపించింది. జెండా పట్టి..బండ్లు కట్టి గులాబీ దండు కదిలింది.



- తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ…తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ…తెలంగాణను సాధించిన పార్టీ, పదేళ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పాటలు పెట్టి ఎల్కతుర్తి సభకు తరలివెళుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి ఓరుగల్లుకు జనప్రభంజనం కదిలింది.




25 అంబాసిడ‌ర్ కార్ల‌తో ఎల్క‌తుర్తికి...

బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఎగిసెర భలే ఎగిసెరో.. సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెరా’ గేయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో శేరిలింగంపల్లి నుంచి వరంగల్‌కు 25 గులాబీ అంబాసిడర్ కార్ల వాహనాల శ్రేణిని కవిత జెండా ఊపి ప్రారంభించారు.

బీఆర్‌ఎస్ రజతోత్సవ సందర్భంగా కేసీఆర్ సైకత శిల్పం

బీఆర్‌ఎస్ రజతోత్సవ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై అభిమానంతో, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఒడిశాలోని పూరీ గోల్డెన్ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో "కేసీఆర్ మా కోసం మీరు నిలబడ్డారు, మీ కోసం మేం నిలబడతాం" అనే సందేశంతో పాటు బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన వివరాలను పొందుపర్చారు.కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.ఒడిశాలోని పూరీ గోల్డెన్ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పకళాకారుల ఆధ్వర్యంలో దీనిని రూపొందించినట్లు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వివరించారు.


Read More
Next Story