
రేవంత్ దెబ్బకు బీఆర్ఎస్ వాకౌట్
తమ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నేత ప్రసంగాన్ని తాము బహిస్కరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలంతా సభ నుంచి బయటకు వెళ్లారు. రేవంత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుండటంతో బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలో రైతు రుణమాఫీ, గృహ జ్యోతి పథకాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ నడిచింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే బీఆర్‌ఎస్ సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం ప్రసంగాన్ని తాము బాయ్‌కాట్ చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తమ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం అవుతూనే.. తమ అధినేత చావును కోరుకున్న నేత ప్రసంగాన్ని తాము బహిస్కరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అందుకే ఆయన ప్రసంగం పూర్తయ్యే వరకు సభ నుంచి వెళ్లిపోతున్నామని వెళ్లారు.