సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బిగ్ ఫైట్
x

సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బిగ్ ఫైట్

సోషల్ మీడియా వేదికగా ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు పార్టీలు నానా యాగీ పడుతున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది.


మరి కొన్ని గంటల్లో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ మొదలవనుంది. నిన్నటితో పార్టీలు బహిరంగ ప్రచారాలు ముగించేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు నానా యాగీలు పడుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఈ రెండు పార్టీల అధికారిక ఖాతాలలో కౌంటర్, ఎన్కౌంటర్ ట్వీట్స్ నడుస్తున్నాయి. ఇచ్చిన హామీలపై రాష్ట్రంలోని అధికార పార్టీని బీఆర్ఎస్ నిలదీస్తుంటే... అంతే ధీటుగా బీఆర్ఎస్ ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఉదయం నుంచే ఈ బిగ్ ఫైట్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

"ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అంటే ఇదే! లోక్‌సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపికి మేలు చేసి.. బీజేపీని పొగిడి మోడీకి దగ్గరవుదాం అని చూస్తుంది.. బీజేపీతో అంటకాగుతుంది మీ కంపు మేస్త్రి" అని బీఆర్ఎస్ ఆరోపించగా... "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా బీజేపీ పార్టీని విమర్శించలేని దిక్కుమాలిన సోషల్ మీడియా మీది. నేరుగా ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పై మీ సోషల్ మీడియా పోస్ట్ లేదు. ఇక్కడే అర్థం అవుతుంది. మీరు వాళ్ళకి భయపడి అమ్ముడు పోయారని" అంటూ కాంగ్రెస్ కూడా గట్టిగా బదులిచ్చింది.


"వ్యవసాయ కూలీలకు రూ. 12,000 ఏది రేవంత్? గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెబుదాం" అంటూ కారు పార్టీ ఓటర్లకు పిలుపునిచ్చింది. ఈ ట్వీట్ కి కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "తెలంగాణ ప్రజలారా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. పదేళ్ల బీజేపీ పాలన పై ఒక్క విమర్శ కూడా చేయలేని, చేవలేని, చేతకాని సన్నాసి బీఆర్ఎస్ సోషల్ మీడియా. సిగ్గు, శరం లేని బ్రతుకులు మీవి. బీజేపీకి అమ్ముడు పోయి 5 నెలల ప్రజా పాలనపై ఇంత దరిద్రమైన విమర్శలు చేస్తున్న మీకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయం" అని రిప్లై ఇచ్చింది.


ఈ రెండు పార్టీల ట్వీట్ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది....

Read More
Next Story