ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం
x

ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం

ఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్.


ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు ఎవరికి? అన్న అంశంపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సెస్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా విజయానికి సమాన దూరంలో ఉన్న క్రమంలోనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారు. ఇదెలా ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఇందులో అధికార ఎన్‌డీఏ కూటమి తరపున సీపీ రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. విపక్ష పార్టీల ఇండి కూటమి తరుపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఉపరాష్ట్ర ఎన్నికల హోరాహోరీగా సాగనుంది. ఇరు పార్టీల అభ్యర్థులు తమకు మద్దతు ఇవ్వాలని పార్టమెంటు సభ్యులు(ఎంపీ)లను కోరుతున్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగనున్న క్రమంలో ప్రతి పార్టీ మద్దతు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఇప్పటి వరకు టీడీపీ, బీఆర్ఎస్.. తమ మద్దతు ఎవరికి అనేది ప్రకటించలేదు. తాజాగా ఇప్పుడు ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు టీడీపీ ఎటు వైపు నిలబడుతుంది అనేది కీలకంగా మారింది. కాగా ఎంపీలంతా కూడా ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని సుర్శన్ రెడ్డ కోరారు.

ఆత్మ ప్రబోధంతో ఓటేయడం ఎలా..?

ఇండియాలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా మరికొన్ని ఎన్నికలకు విప్ వర్తించదు. అంటే ఈ ఎన్నికల్లో ఓటేసే అభ్యర్థులు తమ పార్టీ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లు స్వతంత్రంగా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయొచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్ ఉండదు. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటు ద్వారా ఎన్నిక జరుగుతుంది. ప్రతి సభ్యుడు తన మనసు, తన నిర్ణయం ప్రకారం ఓటు వేయడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. అయితే సాధారణంగా లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులపై లేదా తీర్మానాలపై ఓటింగ్ సమయంలో పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి.. అప్పుడప్పుడు ఎవరికి ఓటు వేయాలో పార్టీ సభ్యులకు చెప్తారు కూడా, పార్టీ విప్ ద్వారా ఆదేశాలు జారీ చేశాక, దాన్ని ఉల్లంఘిస్తే సభ్యుడిపై చర్యలు కూడా ఉంటాయి.

Read More
Next Story