‘రైతులకు బేడీలు వేస్తే బీఆర్ఎస్ ఊరుకోదు’.. రైతులకు అండగా బీఆర్ఎస్
x

‘రైతులకు బేడీలు వేస్తే బీఆర్ఎస్ ఊరుకోదు’.. రైతులకు అండగా బీఆర్ఎస్

గిరిజన రైతులకు అండగా ఎవరూ ఉండరని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తప్పేనని, గిరిజన రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.


గిరిజన రైతులకు అండగా ఎవరూ ఉండరని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తప్పేనని, గిరిజన రైతులకు, ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. గిరిజన రైతుల గురించి చర్చించాలని సభలో కోరితే సభనే వాయిదా వేయడం దారుణమన్నారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకన చూపు ఉందే ఈ విషయాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. రైతులకు బేడీలు వేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, సభ జరిగినన్ని రోజులు రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిరసన క్రమంలో సభ బుధవారానికి వాయిదా పడింది. అనంతరం శాసనమండలి ఛైర్మన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్సీలు మాట్లాడారు. లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కవిత పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఖరి దారుణం: మధుసూదన చారి

ఈ సందర్బంగా మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. లగచర్ల రైతులను వారి భూముల నుంచి వెళ్లగొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లగచర్ల రైతు పక్షాణ తమ పార్టీ నేతలు సోమ, మంగళవారాలు శాసనమండలిలో నిరసన చేపట్టినట్లు వివరించారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడం ఈ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని, రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదంటూ మండిపడ్డారు. చేయని తప్పుకు రైతులు జైళ్లలో మగ్గుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హాయంలో కేసీఆర్.. రైతులను అన్ని కష్టాల నుంచి ఆదుకున్నారని గుర్తు చేశారు.

రైతులకు ఇచ్చిన హామీలపై చర్చించాలి: జగదీష్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ‘‘ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయం అవుతుంది. స్పీకర్ కూడా ముఖ్యమంత్రి ఆలోచనలు అమలు చేసే విధంగా ఉన్నాడు. ప్రతి పక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల సమస్యలపై పోరాడుతుంది. కేసీఆర్ ఇప్పుడే ఎందుకు అన్నాడు. కానీ ప్రభుత్వం సృష్టిస్తున్న సమస్యలపై పోరాడుతున్నాం. మూసి ధన దాహం,హైడ్రా పై ఇబ్బందులను ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లగచర్లల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రి కి తీసుకొచ్చారు. రైతులకు బేడీలు,ముఖ్యమంత్రి, మంత్రులు విహార యాత్రలు చేస్తున్నారు. జరుగుతున్న విషయాలపై ప్రశ్నిస్తే పారిపోయారు. మందబలంతో స్పీకర్ కాంగ్రెస్ పక్షపాత వైఖరి చేయడం కరెక్ట్ కాదు. లగచర్ల గిరిజన రైతుల ఇస్యుమీద మా పోరాటం కొనసగుతాది. ప్రజలను పెట్టె హింసలను అడ్డుకుంటాం. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రైతుల నుండి సేకరించిన ధాన్యం ఎంత అడిగితే కాకుల లెక్కలు మాట్లాడుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read More
Next Story