కేంద్రంతో గొడవలు పడం: రేవంత్
x
రేవంత్ రెడ్డి

కేంద్రంతో గొడవలు పడం: రేవంత్

తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో గొడవలు పెట్టుకోమన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యమంటూ విమర్శలు గుప్పించారు.



కేంద్రంతో గిల్లికజ్జాలాంటివి తమ ప్రభుత్వ హయాంలో అంజనం వేసినా కనిపించవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని, స్వార్థ రాజకీయాలకు పాల్పడదని ధీమా వ్యక్తం చేశఆరు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేన్నారు. దూరదృష్టితో ఆలోచించి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి పుష్కలం, అభివృద్ధి శూన్యమని చురకలంటించారు.

బీఆర్ఎస్ హయాంలో చేసిందేముంది

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది కోసం, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అని అవినీతి చేయడం తప్ప కేసీఆర్ ఏం చేయలేదన్నారు. అప్పులు తెచ్చి సంక్షేమాలు అందిస్తూ ప్రతి వ్యక్తిపై అప్పుల భారం మోపిందే కాక అదే అభివృద్ధి అన్నట్లు ప్రగల్బాలు పలికారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత లబ్ది వాళ్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు బీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబీకులేనని, ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌ల పేరుతో వేల కోట్ల రూపాయలు కొట్టేసి ప్రజలకు నాసిరకం ప్రాజెక్ట్‌లు అందించారని, అందుకు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్‌లు నిలువెత్తు నిదర్శనాలని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలో పడేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై నోరేసుకుని పడిపోవడం తప్ప కేసీఆర్‌కు ఏం చేతకాదని విమర్శలు చేశారు.

కేంద్రంతో బేషజాలం ఉండదు

ప్రజలకు సేవ చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నంత కాలం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని భావిస్తామని, అందుకే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ అంశంలో కూడా కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, దేశానికి మేలు చేసే అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని, అదే విధంగా కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్ర, ప్రజల సంక్షేమం కోసం మద్దతు ఇవ్వాలని కోరారు.


Read More
Next Story