రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం
x
KTR

రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది.


రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కటం, ఫిరాయింపులకు పాల్పడటం ద్వారా రాజ్యాంగహననానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నప్రోటోకాల్ వివాదం తదితరాలపై జాతీయ పార్టీలనేతలను కలవటంతో పాటు రాష్ట్రపతిని కూడా కలిసి వినతిపత్రాన్ని ఇవ్వాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి తెలంగాణాలో పరిస్ధితులను వివరిస్తామన్నారు.

ఎన్నికల సమయంలో జనాలకు ముఖ్యంగా విద్యార్ధులకు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధకారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కిందని కేటీయార్ మండిపోయారు. ఇచ్చిన హామీల ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటించలేదని, 25 వేల టీచర్ పోస్టుల భర్తకి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను గుర్తుచేసిన విద్యార్ధులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించటం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జనాలకు జరుగుతున్న నష్టాలన్నింటినీ తాము గవర్నర్ కు వివరించినట్లు కేటీయార్ చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా రాజ్యాంగహనానికి పాల్పడుతున్న విషయాన్ని ఫిర్యాదుచేశామని కేటీయార్ చెప్పారు.

తాము చేసిన ఫిర్యాదులన్నింటినీ గవర్నర్ విన్నారని, చెప్పిన విషయాలను ఓపికగా విన్న గవర్నర్ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సమాచారాన్ని తెప్పించుకుంటానని తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రోటోకాల్ వివాదంపైన కూడా గవర్నర్ కు వివరించామన్నారు. నియోజకవర్గాల్లో తమపార్టీ ఎంఎల్ఏలకు అధికారులు అసలు గౌరవమే ఇవ్వటంలేదని కేటీయార్ మండిపడ్డారు. అన్నీ విషయాలను తాము గవర్నర్ కు వివరించామని తాను సమాచారం తెప్పించుకుంటానని తమకు గవర్నర్ హామీ ఇచ్చినట్లు కేటీయార్ చెప్పారు.

గవర్నర్ కు ప్రభుత్వంపై ఫిర్యాదుచేయటం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉంటుందో కేటీయార్ కు తెలీకుండా ఉండదు. గవర్నర్ ను ఎవరు కలిసి ఫిర్యాదులు చేసినా వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి సమాచారాన్ని తెప్పించుకుంటాననే చెబుతారు. కాకపోతే మిగిలిన వాళ్ళు వేరు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేరు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఫిర్యాదులపై ఎక్కువ దృష్టిపెట్టుంటారనటంలో సందేహంలేదు. అయితే కేటీయార్ చేసిన ఫిర్యాదులపై ఏ మేరకు చర్యలుంటాయన్నదే కీలకం. మరి ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story