Eathanol Factory
x

Ethanol Factory | ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులపై సాక్ష్యాలు బయపెట్టిన ప్రభుత్వం..

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది.


నిర్మల్(Nirmal) జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) నిర్మాణంపై కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. ఈ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే హమీలు ఇచ్చిందని, అనుమతులను ఫైనల్ చేస్తూ కేసీఆర్, కేటీఆర్ కూడా సంతకాలు చేశారని మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి కిరణ్‌కు చెందినదేనని కూడా పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం ఈ ఫ్యాక్టరీ అనుమతులకు సంబంధించి ప్రభుత్వం కీలక విషయాలను బహిర్గతం చేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని నిరూపించే సాక్ష్యాలను ప్రభుత్వం విడుదల చేసింది.

‘‘ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయి. ఈ కంపెనీకి అనుములు అప్పిసంగా ఇచ్చి ప్రజలను మోసం చేశారు. పర్యావరణ శాఖ పర్మిషన్లను ఉల్లంఘించి నిబంధనలను తుంగలో తొక్కారు. కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిని పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, ఆబ్లల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తులకు కూడా బీఆర్ఎస్ పాలనతోని మంత్రివర్గం అనుమతులు ఇచ్చేసింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా పర్మిషన్లు ఇచ్చారు గత పాలకులు. మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థలు ఎన్‌ఓసీ తీసుకోవాలి. అదేమీ లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించే. బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించింది. 22 అక్టోబర్ 2022న గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఓఐ జారీ చేసింది’’ అని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.

సీతక్క ఏం చెప్పారంటే..

‘‘దిలావర్పూర్‌లో ఆనాడు అనుమతులన్నీ బీఆర్ఎస్ పార్టీ అప్పనంగా అప్పచెప్పింది. బీఆర్ఎస్ విధానానికి ఆనాడు నిరసనలు చేస్తే అధికార బిఅరెస్ మమ్మల్ని అపహస్యం చేసింది. ఆనాడు కనీస గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా అనుమతులను సంస్థకు టిఆర్ఎస్ ఇచ్చింది. సంపూర్ణమైన అనుమతులు ఇచ్చింది కేసీఆర్ కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. రాజకీయ దురుద్దేశం తో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. పర్మిషన్ ఎవరిచ్చారు చర్చకు సిద్ధం రావాలని కోరుతున్నాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ తో పాటు మరో 10 మంది డైరెక్టర్లు ఉన్నారు. కడప జిల్లా చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాడు బీజేపీ గ్రామ సభలు అవసరం లేదని బీజేపీ సపోర్ట్ చేసింది. రెచ్చగొట్టే వైఖరి బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తాం. ఢిల్లీ బీజేపీ పెద్దలతో పర్మిషన్లు ఇప్పించింది కేటీఆర్, కేసీఆర్ వివరాలు బయటపడతాం. నీతి నిజాయితీ నీకుంటే మీ హయాంలో అనుమతులు ఇచ్చామని బీఆర్ఎస్ ఒప్పుకోవాలి. తప్పుడు ప్రచారాలతో మనుగడ సాధించలేరు. యూట్యూబ్ ఛానల్ లతో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోవు. ఇథనాల్ సంస్థ వివాదంలో అసెంబ్లీలో చర్చ పెడతాం. ఆధారాలు స్పీకర్కు సమర్పిస్తాం. చర్చకు మేము సిద్ధం’’ అని సీతక్క వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కూడా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం నిర్మల్‌లో ఆందోళనలకు కారణమైన ఇథనాల్ ఫ్యాక్టరీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిదేనని వ్యాఖ్యానించారు.

నాకు సంబంధం లేదు: తలసాని

‘‘అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. పీసీసీ చీఫ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్‌ను ఖండిస్తున్నాను. ఇథనాల్ కంపెనీతో నాకొడుకు సాయి కిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తా. పీసీసీ చీఫ్‌కు ఇదే నా సవాల్. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. సందర్భం వచ్చినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వారికి నేనేంటో చూపిస్తాను. ఇథనాల్ కంపెనీకి పర్మిమిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు. ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ విడుదల చేసిన సాక్ష్యాలు కీలకంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ బల్లగుద్ది చెప్తోంది. మరి ఇప్పుడు దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story