
కోడితో బీఆర్ఎస్ వినూత్న ప్రచారం
రేవంత్ ప్రభుత్వ వైఖరిని ‘అహనాపెళ్ళంట’ సినిమాలో కోట శ్రీనివాస్(Kota Srinivas) చికెన్ కర్రీ(Chicken Curry) తినే సన్నివేశాన్ని ప్రతి ఇంటికి తిరిగి గుర్తుచేస్తున్నారు
అహనాపెళ్ళంట సినిమాలో కోటశ్రీనివాసరావు తనకు ఎదురుగా చికెన్ ను వేలాడి దీసి అన్నంతినే సన్నివేశం గుర్తుందికదా. అదేపద్దతిలో ఇపుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS) కూడా ప్రచారం చేస్తోంది. కొందరు మహిళలు చనిపోయిన కోడిని పట్టుకుని నియోజకవర్గంలోని అన్నీ డివిజన్లలో తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తమకు అవిస్తామని..ఇవిస్తామని హామీలిచ్చి మోసంచేసినట్లు చెబుతున్నారు. సంక్షేమపథకాలు అందిస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వ వైఖరిని ‘అహనాపెళ్ళంట’ సినిమాలో కోట శ్రీనివాస్(Kota Srinivas) చికెన్ కర్రీ(Chicken Curry) తినే సన్నివేశాన్ని ప్రతి ఇంటికి తిరిగి గుర్తుచేస్తున్నారు. ‘రేవంత్ హామీలతో తాము మోసపోయామని అలాగే మీరు కూడా మోసపోవద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా చనిపోయిన కోడిని చూపిస్తు ఇల్లిల్లు తిరుగుతు సినిమాలో సన్నివేశానికి జోడించి రేవంత్ పాలనపై బీఆర్ఎస్ సెటైర్లు వేయించటం అందరినీ ఆకట్టుకుంటోంది.

