తెలంగాణభవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు.. 71కిలోల కేక్ కట్ చేసిన కేటీఆర్
x

తెలంగాణభవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు.. 71కిలోల కేక్ కట్ చేసిన కేటీఆర్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తెలంగాణభవన్‌లో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు.


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తెలంగాణభవన్‌లో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. వీటిలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ బర్డ్‌డే సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ గారిపై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.

కేసీఆర్ అంటే భావోద్వేగం: హరీష్

గాంధీభవన్‌లో నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమన్నారు. తెలంగాణకు కేటీఆర్‌తో ఉన్న బంధం పేగుబంధమన్నారు. తెలంగాణ ప్రజలది, కేసీఆర్‌ది తల్లీబిడ్డల సంబంధమన్నారు. ‘‘1969 మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ వయసు 15 ఏళ్లు. అప్పుడే జైతెలంగాణ అని నినదించిన నాయకుడు కేసీఆర్. వేల గంటలపాటు మేధోమథనం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ కోసం అన్ని పదవులను త్యాగం చేసిన మహానాయకుడు. తెలంగాణ వచ్చిందంటే కేసీార్ మొండిపట్టుదలే కారణం. తెంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవయాత్రనో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ దీక్ష చేపట్టడంతో కేంద్రం కూడా దిగొచ్చింది. తెలంగాణను ప్రకటించింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించాం’’ అని తెలిపారు.

కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి: కేటీఆర్

కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో 71 కేజీల కేక్ కట్ చేశారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్.. తెలంగాణ కారణజన్ముడు. ఆయన మళ్ళీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి గట్టిగా పనిచేద్దాం. రానున్న మూడున్నరేళ్లు 60 లక్షల గులాబీ దండు మొత్తం ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.

Read More
Next Story