
అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన.. ఎందుకో చెప్పిన కేటీఆర్
రైతుల కష్టాలకు సంఘీభావంగా వరి కంకులతో నిరసన తెలుపుతూ.. రేవంత్ రెడ్డి పాపం.. రైతుల పాలిట శాపం అంటూ నినాదాలు చేస్తున్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. మరికాసేపట్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి మరోసారి వినూత్న నిరసన చేపట్టారు. రైతుల కష్టాలకు సంఘీభావంగా వరి కంకులతో నిరసన తెలుపుతూ.. రేవంత్ రెడ్డి పాపం.. రైతుల పాలిట శాపం అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే అందాల పోటీలా అంటా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కేసీఆర్ హాట్లాడారు. రైతులకు సంఘీభావంగా వారి పరిస్థితినీ ప్రభుత్వం దృష్టికీ తెచ్చేందుకు వరి కంకులతో వినూత్నమైన కార్యక్రమం చేపట్టాని వెల్లడించారు.
‘‘కరువుతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేడిగడ్డలో ఇసుక దోపిడీ జరుగుతుంది. కేసీఆర్ హయంలో 36 శాతం కృష్ణా జలాలను వాడుకొని , టెయిలెండ్ వరకు నీళ్లు ఇచ్చాం. ఇవ్వాల చంద్రబాబు నాయుడు భయంతో ఆంధ్రాకు నీళ్ళను వదిలి పెట్టారు. 6 కోట్లతో దేవాదుల పంపులు భాగుచేస్తే పంటలు ఎండకపోతుండే. 600 కోట్ల పంట నష్టం ఒక్క వరంగల్ జిల్లాలోనే వచ్చింది. కాలం తెచ్చిన కరువు కాదు , ఇదీ కాంగ్రెస్ తెచ్చిన కరువు. రైతుల తరుపున మా డిమాండ్ ఒక్కటే. ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయి అని ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. బావుల క్రింద పంటలు ఎండితే మాకేం సంబంధం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎండిన పంటలకు ఎకరానికి 25 వేళ రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.