SLBC కన్‌స్ట్రక్షన్ ఆఫీసు ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు
x

SLBC కన్‌స్ట్రక్షన్ ఆఫీసు ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు

అధికారులను కలవడానికి తమకు అనుమతివ్వాలని డిమాండ్


ఎస్‌ఎల్‌బీసీ ఘటన స్థలం వద్దకు బీఆర్ఎస్ నేతలు ఈరోజు వెళ్లారు. కానీ వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన హరీష్ రావు.. తనను ఎవరినీ కలవకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబీకులకు కూడా కలవనివ్వడం లేదని, ప్రతిపక్ష నేతలు వస్తే అధికారంలో ఉన్న వారు వణికిపోతున్నారు ఎందుకో అర్థం కావడం లేదనంటూ విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, సరైన సూచనలు కూడా చేయడం లేదని విమర్శించారు. వారు చేయలేకపోతున్న సూచనలు చేయడానికి తామొస్తున్నామంటూ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ దగ్గర తమకు ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో సొరంగం కన్‌స్ట్రక్షన్ చేస్తున్న జేపీ సంస్థ ప్రధాన కార్యాలయం దగ్గరకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు.

కార్యాలయంలో ఉన్న మంత్రి ఉత్తమ్ బయటకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతలు అక్కడే బైఠాయించి.. మంత్రి బయటకు రావాలంటూ నినాదాలు చేస్తున్నారు. అధికారులను కలవడానికి తమకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న మంత్రికి తమను కలవడానికి భయమెందుకంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో జేపీ కన్‌స్ట్రక్షన్స్ ఆఫీసు దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అంతకన్నా ముందు ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో హరీష్ రావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను అభినందించాలని అన్నారు.

‘‘ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా అభినందించాలి. చివరి పాయింట్ వరకు వెళ్లి వచ్చామని వారు చెప్పారు. వివిధ బృందాలతో కం బైండింగ్ సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆపరేషన్ లో స్పష్టమైన డైరెక్షన్ లేదు. నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుంది. జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు. ఇంత పెద్ద ఘటన కన్నా ముఖ్యమైన పని ముఖ్యమంత్రి కేముంటుంది. ఇప్పటికి కన్వేయర్ బెల్టు పనిచేయడం లేదు. కొద్ది గంటల్లోనే కన్వేయర్ బెల్టును మన ఇద్దరించవచ్చు. టి.బి.ఎం మిషన్ భాగాలను కట్ చేయడానికి నాలుగు రోజుల టైం తీసుకుంది ప్రభుత్వం’’ అని అన్నారు.

‘‘8 మంది ప్రాణాలు కాపాడటంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. ఈ ఆపరేషన్ లో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. ఉత్తంకుమార్ రెడ్డి రెండు రోజుల్లో ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పడం విడ్డూరంగా ఉంది. టన్నెల్లోకి వెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది. ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. 15 సంవత్సరాల్లో 15 మీటర్ల దూరమైనా టన్నెల్ తవ్వారా. ప్రమాదం జరిగిన నీటికి దగ్గరలో నీటికి సంబంధించిన ఒక వాగు ఉంది. దీనిపై క్లారిటీ లేకుండానే ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ హయాంలో 3300 కోట్లు ఈ ప్రాజెక్టుకి ఇస్తే మా పార్టీ హాయంలో 3900 కోట్ల రూపాయలు దాదాపు 600 కోట్లు ఎక్కువగా ఇచ్చాము’’ అని తెలిపారు.

‘‘ఆటంకాలు వచ్చిన దాదాపు 12 కిలోమీటర్లు పూర్తి చేసాం. దివానాకూరి దిగజారుడు కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదు. సమన్వయంతో పనిచేసి చిక్కుకున్నవారి ప్రాణాలు కాపాడాలి. హెలికాప్టర్ వేసుకుని రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళితే హెలికాప్టర్ లేదంటూ మంత్రి ఇంట్లో కూర్చున్నాడు. మీకు ప్రచారం ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా. చిక్కు కున్నవారు కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత సీఎంకు లేదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి. సుంకి సాల ప్రాజెక్టు కుప్ప కూలిపోయింది. వట్టెం పంప్ హౌస్ జలమయం అయ్యింది. శ్రీశైలం కాళీ అయిపోతుఉంటే ప్రభుత్వం నిద్రపోతుందా?’’ అని ప్రశ్నించారు.

‘‘రాయలసీమకు పోతిరెడ్డి నుండి నీళ్లు తీసుకుపోతుంటే చూస్తూ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ ముందు కట్టే పెట్టి ఉత్తితే తప్ప పని చేసే పరిస్థితి తప్పులేదు. చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. గోదావరి బంకచర్ల లింకుపెట్టి 150 టి.యం.సి నీటిని ఆంధ్రకు తరలిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కొట్లాట మొదలైంది. ముందుగా టన్నెల్ లో కూలిపోయిన బురద మట్టిని త్వరత గతిన బయటకి తీయాలి’’అని డిమాండ్ చేశారు.

In Front

Read More
Next Story