మూసీ బాధితులకు బీఆర్ఎస్ భరోసా..
x

మూసీ బాధితులకు బీఆర్ఎస్ భరోసా..

ప్రభుత్వంపై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా తాము ఇళ్లు ఖాళీ చేయమని, తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆందోళనవ వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వంపై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా తాము ఇళ్లు ఖాళీ చేయమని, తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే గాంధీభవన్ ముట్టడిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణ బాధితులకు అండగా నిలవడానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, ఈటెల రాజేందర్.. ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. మూసీ నిర్వాసితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు కలిసికట్టుగా బయలుదేరారు. తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనను ప్రారంబించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమ్మద్ హాలీ పాల్గొన్నారు. మూసీ, హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిట్టచివరి వరకు తాము బాధితుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలన చేస్తోందని, ఒక్క ఒక్క హామీని కూడా సరిగా అమలు చేసిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆఖరికి అన్నం పెట్టే రైతులను కూడా రుణమాఫీ పేరిట మోసం చేశారని, ఇప్పటికి కూడా సగానికి పైగా రుణమాఫీ లబ్ధిదారులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు ముసీ పరివాహక ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పునరావాసం కల్పించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని నిలదీశారు.

పిచ్చోడి చేతిలో రాయిలా పాలన

మూసీ నిర్వాసితులతో చర్చించిన బీఆర్ఎస్ నేతలు వారికి భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులకు న్యాయం, సాయం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది చురకలంటించారు. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని, మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కానీ, ఇప్పుడు వారిని ఉన్న ఇళ్ల నుంచి కూడా తరిమేయాలని చూస్తోందని మండిపడ్డారు.

బుల్డోజర్ రాజ్యం సరికాదు..

కాగా హైడ్రా కూల్చివేతలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లక్ష్యం ఏంటని ప్రశ్నించారు. పేదలకు కనీస వసతులు కల్పించడా లేకుంటే రూ.లక్షన్నర కోట్లు కర్చు చేసి మూసీ సుందరీకరణ చేయడమా అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే గరీబీ హటావోనా.. గరీబోంకో హటావోనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ప్రస్తుతం బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, దీనిని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. సక్షేమ పథకాలు అమలుకు డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం ఖర్చు చేస్తామన్న రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. పేద పిల్లలకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవని ఏడు నెలలుగా చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెలస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు.

Read More
Next Story