ప్రత్యేకదేశంగా సౌత్ ఇండియా: బీఆర్ఎస్ ఎంఎల్ఏ బెదిరింపు
డీలిమిటేషన్ పేరుతో కేంద్రప్రభుత్వం దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయంచేయాలని చూస్తే ప్రత్యేకదేశం కావాలనే డిమాండు మొదలైనా ఆశ్చర్యపడక్కర్లేదన్నారు.
మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గంగులకమాలకర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రప్రభుత్వం దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయంచేయాలని చూస్తే ప్రత్యేకదేశం కావాలనే డిమాండు మొదలైనా ఆశ్చర్యపడక్కర్లేదన్నారు. తనవైఖరిని కేంద్రప్రభుత్వం మార్చుకోకపోతే ప్రత్యేక తెలంగాణ(Telangana) తరహాలోనే ప్రత్యేక డిమాండు దక్షిణాధి రాష్ట్రాల్లో(South States) మొదలయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు. పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో గంగుల పై వ్యాఖ్యలుచేశారు. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్(Delimitation) కత్తులు వేలాడుతున్నట్లు మాజీ ఎంఎల్ఏ చెప్పారు. పై రెండు సమస్యలను చాకచక్యంగా, అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించకపోతే కేంద్రప్రభుత్వానికి సమస్యలు తప్పవని జోస్యంచెప్పారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేయాలన్న కేంద్రప్రభుత్వ వైఖరిని గంగుల తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో కేంద్రప్రభుత్వం చేసిన జనాభానియంత్రణ చట్టాన్ని చక్కగా అమలుచేసిన దక్షిణాధి రాష్ట్రాలను ఇపుడు(Narendra Modi) నరేంద్రమోడీ ప్రభుత్వం శిక్షించదలచుకున్నారా అని గట్టిగా నిలదీశారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రక్రియపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో పాతికేళ్ళు పొడిగించాలని చెన్నై సమావేశం డిమాండ్ చేసిన విషయాన్ని గంగుల గుర్తుచేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారుచేసిన లోక్ సభ స్ధానాల సంఖ్యనే మరో పాతికేళ్ళు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్దంగా అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం వైఖరిలో మార్పురాకపోతే దక్షిణాధి రాష్ట్రాల్లో వ్యతిరేకత పెరిగిపోవటం ఖాయమని జోస్యం కూడా చెప్పారు. చెన్నైలో తమిళనాడు(TamilNadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్( CM MK Stalin) ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 14 పార్టీల నేతలు హాజరైన విషయాన్ని గంగుల గుర్తుచేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే నరేంద్రమోడికి ఎంపీల ద్వారా విజ్ఞాపన అందించబోతున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు.