చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎంఎల్ఏల భేటీ... రాజకీయం మొదలైందా ?
x
BRS MLAs with Naidu

చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎంఎల్ఏల భేటీ... రాజకీయం మొదలైందా ?

చంద్రబాబునాయుబడు తెలంగాణా గడ్డపై తనదైన రాజకీయాన్ని మొదలుపెట్టేశారా ? టీడీపీ పుట్టిన గడ్డపై పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబుచేసిన ప్రకటనకు అర్ధమిదేనా ?


చంద్రబాబునాయుబడు తెలంగాణా గడ్డపై తనదైన రాజకీయాన్ని మొదలుపెట్టేశారా ? తెలుగుదేశంపార్టీ పుట్టిన గడ్డపై పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబుచేసిన ప్రకటనకు అర్ధమిదేనా ? పార్టీతో పాటు తనను వ్యక్తిగతంగా దారుణంగా దెబ్బకొట్టిన కేసీయార్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటమే చంద్రబాబు అసలు వ్యూహమా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరు చంద్రబాబును కలిశారు. అలాగే మంత్ర తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు.

విషయం ఏమిటంటే మంత్రి తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఆరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఆదివారం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీళ్ళే కాకుండా మరికొందరు ఎంఎల్ఏలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబుతో కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై చంద్రబాబును కలిసిన వారిలో రకరకాల సామాజికవర్గాల వాళ్ళున్నారు. అయితే వీళ్ళలో కామన్ పాయింట్ ఏమిటంటే అందరూ హార్డ్ కోర్ టీడీపీ నేతలే. సామాజికవర్గాలపరంగా వేరే అయినా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం పనిచేయటంలో ముందువరసలో ఉంటారు. ఒకవైపు కేసీయార్ను సాంతం దెబ్బతీయటంలో రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇప్పటికి బీఆర్ఎస్ చెందిన ఏడుగురు ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. మరింతమంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలపై రేవంత్ గురిపెట్టారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన 38 మంది ఎంఎల్ఏల్లో తక్కువలో తక్కువ 25 మందిని కాంగ్రెప్ లోకి లాక్కోవాలన్నది రేవంత్ టార్గెట్. అలాగే కారుపార్టీకి ఉన్న 29 మంది ఎంఎల్సీల్లో కనీసం 20 మందిని చేర్చుకునేట్లుగా పావులు కదుపుతున్నారు. ఇపుడు చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలు గాంధి, ప్రకాష్ గౌడ్ తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. అలాగే మాధవరం, మండవ, మాగంటి కూడా హస్తంపార్టీలో చేరుతారనే ప్రచారం బలంగా ఉంది. కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారంలో ఉన్న ఎంఎల్ఏల్లో ఇద్దరు చంద్రబాబుతో భేటీ అవ్వటం గమనార్హం.

ఇక్కడే కేసీయార్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎలాగంటే చంద్రబాబు, రేవంత్ కు కేసీయార్ కామన్ శతృవు. కేసీయార్ను దెబ్బకొట్టాలంటే ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఒక్కడివల్ల కాదు. ఆల్రెడీ రేవంత్ అదేపనిమీదున్నారు. తెలంగాణాలో టీడీపీ పుంజుకోవటానికి టైం పడుతుంది. అందుకనే తక్షణ కర్తవ్యంగా పరోక్షంగా రేవంత్ కు మద్దతిస్తే కేసీయార్ను చాలా తొందరగా దెబ్బకొట్టచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా అర్ధమవుతోంది. ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని తెలంగాణాకు మొదటిసారి వచ్చిన చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చెబుతున్నారు. చంద్రబాబు-కేసీయార్ బద్ధవిరోధులన్న విషయం అందరికీ తెలిసిందే. తమ అధినేతకు బద్ధవిరోధముందని తెలిసినా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చంద్రబాబును కలిసారంగటే అర్ధమేంటి ? మర్యాదపూర్వకంగా కూడా వీళ్ళు చంద్రబాబును కలవకూడదు. అయినా కలవటం, ఫొటోలు రిలీజవ్వటం కూడా అయిపోయాయి.

వీళ్ళభేటీ విషయం బయటకు అధికారికంగా తెలియకపోయినా తనను కలిసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలతో కాంగ్రెస్ లో చేరే విషయమై చంద్రబాబు చర్చించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ లో చేరే విషయంలో ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ చాలాకాలంగా వెనకా ముందు ఆలోచిస్తున్నారు. అలాంటిది తాజా భేటీలో ప్రకాష్ కు క్లారిటి వచ్చినట్లు చెబుతున్నారు. తొందరలోనే బీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ హార్డ్ కోర్ నేతలంతా చంద్రబాబు కలవబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మొత్తానికి తెలంగాణాలో టీడీపీని బలోపేతం చేస్తానని చెప్పిన వెంటనే అందుకు పావులు కదుపుతుండటం గమనార్హం.

Read More
Next Story