
బిసీ బంద్ కు బిఆర్ఎస్ మద్దత్తు
ఆర్ కృష్ణయ్యతో సమావేశమైన బిఆర్ఎస్ అధ్యక్షుడు కెటిఆర్
ఈ నెల 18వ తేదీన బిసి సంఘాలు నిర్వహించతలపెట్టిన బిసి బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో బిసీ జెఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ బిసీలకు రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదని, తమ వైఫల్యాన్ని కేంద్రం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. పార్లమెంటులో పాస్ చేయాల్సిన బిసీ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించడం కాంగ్రెస్ కు చిత్తశుద్దిలేదని రుజువయ్యిందన్నారు. బిసీల అభ్యున్నతికి బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ చిత్త శుద్దితో పని చేశారన్నారు. 2004లో ప్రధానమంత్రి దగ్గర మూడు అంశాలను ప్రస్తావనకు తెచ్చారని ఒకటి కేంద్రంలో బీసీ మంత్రి, రెండు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్, మూడు చట్ట సభలకు రిజర్వేషన్ కావాలని ప్రతిపాదన పెట్టినట్టు కెటిఆర్ గుర్తు చేశారు.