కేసీఆర్ మేడిగడ్డ టూర్  ప్రభుత్వం అలర్ట్
x
KCR and Medigadda

కేసీఆర్ మేడిగడ్డ టూర్ ప్రభుత్వం అలర్ట్

గురువారం తెలంగాణా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ్యలు, శాసనమండలి సభ్యులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించబోతున్నారు.


బీఆర్ఎస్ పార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. విషయం ఏమిటంటే గురువారం తెలంగాణా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ్యలు, శాసనమండలి సభ్యులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించబోతున్నారు. ఈ బృందానికి కేసీయార్ నాయకత్వం వహించబోతున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. శుక్ర, శని, ఆదివారాలు సమావేశాలుండవు. అందుకనే గురువారం మధ్యాహ్నంపైన పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కలిసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు ముందు మేడిగడ్డ తర్వాత సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను కూడా సందర్శించబోతున్నారు. అంతాబాగానే ఉందికాని అసలు కేసీయార్ నాయకత్వంలో సభ్యులు మేడిగడ్డను ఎందుకు సందర్శిస్తున్నట్లు ? సందర్శించి ఏమిచేస్తారు ? అన్నదే అర్ధంకావటంలేదు.




కాళేశ్వరం ప్రాజెక్టులో నీటినిల్వ కోసం మద్దతుగా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరమైనా మేడిగడ్డ ప్రాజెక్టులు నాసిరకం ప్రాజెక్టులని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఎగువప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా మేడిగడ్డలోకి నీళ్ళు ఫుల్లుగా ఉంది. దాంతో ప్రాజెక్టు నిండుకుండలాగ తయారైంది. అయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తున్న అధికారులు నీటిని బయటకు వదిలేస్తున్నారు. ఈ విషయంపైనే కేటీఆర్, హరీష్ నాన రచ్చచేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాసిరకమని ప్రభుత్వం ఆరోపణలు తప్పని రుజువైంది కదాని కేటీఆర్ పదేపదే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కారణం ఏమిటంటే ప్రాజెక్టులో నీటినిల్వ ఫుల్లుగా ఉండటమేనట. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రాజెక్టులో నీటినిల్వ ఫుల్లుగా ఉండటం కాదు నీటిని అధికారులు గేట్లు ఎత్తేసి ఎందుకు వదిలేస్తున్నారని.




వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు ఎందుకు వదిలేస్తున్నారంటే అలా వదలకపోతే డ్యామ్ దెబ్బతినేస్తుంది కాబట్టే. డ్యామ్ ఎందుకు దెబ్బతింటుందంటే నిర్మాణమంతా నాసిరకం కాబట్టి. వేల కోట్లరూపాయలు ఖర్చుపెట్టి కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులోని పిల్లర్లలో ఏడు కుంగిపోయాయి. దీనివల్ల ప్రాజెక్టు ప్లాట్ ఫామ్ కు అక్కడక్కడ పగుళ్ళొచ్చేశాయి. దాంతో డ్యామ్ గోడలకు కూడా బీటలొచ్చేశాయి.




పిల్లర్లు కుంగిపోయి, ప్లాట్ ఫాముకు పగుళ్ళొచ్చేసి, గోడలు బీటలు వారిందంటేనే ప్రాజెక్టు నిర్మాణం ఎంత నాసిరకమో అర్ధమవుతోంది. పిల్లర్లు కుంగిపోవటం, ప్లాట్ ఫామ్ కు పగుళ్ళు, గోడలకు బీటలంతా కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే బయటపడినా ప్రభుత్వం ప్రపంచానికి తెలీకుండా కొంతకాలం మ్యానేజ్ చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఇవన్నీ బయటపడటంతో సంచలనమైంది.




అప్పట్లోనే ప్రాజెక్టును సందర్శించిన ఇరిగేషన్ నిపుణులు, కేంద్ర జలవనరుల శాఖ నిపుణులు, ప్రముఖ ఇంజనీర్లు ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెట్టారు. నీటినిల్వకు ప్రాజెక్టు పనికిరాదని నిపుణులు తేల్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్ఏ) నిపుణులు కూడా ప్రాజెక్టును సందర్శించి డ్యామ్ లో నీటిని నిల్వఉంచద్దని గట్టిగా చెప్పింది. దాంతో అధికారులు ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా బయటకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎంత నాసిరకంగా నిర్మించిందో బయటపడింది.



అయితే ఈ విషయమై కేసీయార్, కేటీఆర్ ఎదురుదాడులు చేస్తున్నారు. ఒక టీవీ ఛానల్లో కేసీఆర్ మాట్లాడుతు రెండు పిల్లర్లు కుంగితే ఏమవుతుందని ఎదురు ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. ప్రాజెక్టులన్నాక సమస్యలు తలెత్తకుండా ఉంటాయా ? అని కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారు. సమస్యలు వచ్చిన వెంటనే రిపేర్లు చేయించకుండా ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని ఎదురు ఆరోపిస్తుందటమే విచిత్రంగా ఉంది.


ఇప్పటికే ఒకసారి కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఒకసారి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను సందర్శించారు. ప్రభుత్వంపై నానా మాటలని దుమ్మెత్తిపోశారు. మరిపుడు రెండోసారి మేడిగడ్డ ప్రాజెక్టుదగ్గరకు వెళ్ళి ఏమిచేస్తారు ? మళ్ళీ ప్రభుత్వంపై దుమ్ముపోయటమే కదా చేసేది ? రాజకీయాలను పక్కనపెట్టేస్తే ఇరిగేషన్, ఇజనీరింగ్ నిపుణులంతా కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణమంతా నాసిరకమే అని పదే పదే చెబుతున్నారు.




ప్రాజెక్టులపై విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన నిపుణులు ఇవే విషయాలను చెప్పారు. ఏ కోణంలో చూసినా మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం నాసిరకమే అని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని ఇప్పటికే నిపుణులు అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ప్రాజెక్టు వాడకానికి ఉపయోపడదని మొత్తం పునాదుల నుండి మళ్ళీ కట్టాల్సిందే అని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టును కేసీయార్ ఇపుడు సందర్శించి ఏమి చేయబోతున్నారు ? అన్నదే ఆసక్తిగా మారింది. కేసీయార్ టూర్ను ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. మరి సందర్శన తర్వాత ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story