అడ్రస్ లేని బీఆర్ఎస్..కదలని కారు
x

అడ్రస్ లేని బీఆర్ఎస్..కదలని కారు

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.


తెలంగాణా పార్లమెంటు ఎన్నికల ఓట్లలెక్కింపు ట్రెండ్ చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. మొత్తం 17 నియోజకవర్గాల్లో తాజా సమాచారం ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఏ నియోజకవర్గంలో కూడా ముందంజలో కనబడలేదు. ఇపుడు జరుగుతున్నది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపే అయినా రెగ్యులర్ ఓటింగ్ సరళిలో జనాల మూడ్ ను పోస్టల్ బ్యాలెట్ల సూచిస్తుందనే అనుకోవాలి. అందుబాటులోని సమాచారం ప్రకారం మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు.

అలాగే మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. 17 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కారుపార్టీ బీఆర్ఎస్ అభ్యర్ధులు లీడ్ లో కనబడలేదు. జరుగుతున్నది చూస్తుంటే తెలంగాణా ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలే నిజమయ్యేట్లున్నాయి. ఏ సంస్ధ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించినా ఎందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చెప్పలేదు. పైగా ఏ సంస్ధ ఎగ్జిట్ పోల్ ను ప్రకటించినా 17 నియోజకవర్గాల్లోను పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని స్పష్టంగా ప్రకటించింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు చెప్పినట్లుగానే ఇపుడు పోస్టల్ బ్యాలెట్ సరళిలో కారుపార్టీ పూర్తిగా వెనకబడిపోయింది.

ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మేదిలేదని, కౌంటింగ్ రోజు బ్రహ్మాండం బద్దలైపోతుందన్నట్లుగా కేసీయార్, కేటీయార్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పైగా ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ బోగస్ అని తాము నమ్మమని పదేపదే ప్రకటించారు. కేసీయార్ మాటల్లో ఉన్న గట్టిదనం ప్రచారంలోను, పార్టీ, అభ్యర్ధుల ఎలక్షనీరింగులో కనబడలేదు. దాంతో అందరికీ కారుపార్టీ వెనకబడిపోవటం ఖాయమనే విషయం చూచాయగా అర్ధమైపోయింది. ఇపుడు జరుగుతున్నది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మాత్రమే. ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు మొదలైన రెండు రౌండ్ల తర్వాత అసలు విషయంపై కొంత క్లారిటి వస్తుంది.

Read More
Next Story