వ్యక్తి దారుణ హత్య
x
Man Killed

వ్యక్తి దారుణ హత్య

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మెడపై కత్తితో కోసినట్లు గమనించారు


గుర్తుతెలీని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం పోలీసులు కనుక్కున్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు దగ్గరలో రోడ్డుపక్కన ఒక మృతదేహం ఉండటాన్ని స్ధానికులు చూశారు. రక్తపుమడుగులో పడున్న గుర్తుతెలీని వ్యక్తి గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వచ్చిన డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం మెడపై కత్తితో కోసినట్లు గమనించారు.

పోలీసుల అనుమానం ఏమిటంటే గుర్తుతెలీని వ్యక్తిని ఎవరో ఎక్కడో చంపేసి తీసుకొచ్చి వ్యవసాయ కళాశాలకు దగ్గరలో పడేసుంటారు. మెడను దారుణంగా కత్తితో కోసేసినట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. గుర్తుతెలీని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి వేసుకున్న బట్టల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

హత్యకు గురైన వ్యక్తి ఎవరు ? ఎందుకోసం హత్య జరిగింది ? అన్న విషయాలు తెలిస్తే తర్వాత హంతకులు ఎవరన్నది తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకేసును ఛేదించటానికి ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటుచేశారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యలతో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Read More
Next Story