ఎన్నికల ముందు బీజేపీకి బడ్జెట్ దెబ్బ ?
తాజాబడ్జెట్లో ఇతరరంగాల మాట ఎలాగున్నా తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిందనే వాదన పెరిగిపోతోంది
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కారణంగా ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బపడటం ఖాయంగా కనిపిస్తోంది. శనివారం కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాబడ్జెట్లో ఇతరరంగాల మాట ఎలాగున్నా తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిందనే వాదన పెరిగిపోతోంది. బడ్జెట్(Central Budget) ను సంఘసంస్కర్త, ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అనే మాటలతో కేంద్రమంత్రి బడ్జెట్ స్పీచ్ ను మొదలుపెట్టింది. అయితే బడ్జెట్ మొత్తాన్ని చూస్తే తెలంగాణ(Telangana) అభివృద్ధి మీద మాత్రం కేంద్రం మట్టిచల్లినట్లుగా అర్ధమవుతోంది.
బడ్జెట్ పై అధికార కాంగ్రెస్(Congress), ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) తో పాటు ఇతర పార్టీలు, సీనియర్ నేతలు, వివిధరంగాల్లో మేథావులు మాత్రం పెద్దఎత్తున మండిపోతున్నారు. ప్రతిపక్షం బీజేపీ నేతలు మాత్రమే బడ్జెట్ బ్రహ్మాండం అంటు గొప్పగా ట్వీట్లుచేస్తున్నారు. గురజాడఅప్పారావు మాటలతో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని తెలంగాణనుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ అద్భుతమంటు నరేంద్రమోడి(Narendra Modi), నిర్మల సీతారామన్ ను అభినందిస్తున్నారు. వీళ్ళుకూడా బడ్జెట్ బ్రహ్మాండమని అంటున్నారు కాని తెలంగాణకు ఏమిటి ప్రయోజనమంటే మాత్రం మాట్లాడటంలేదు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏమీలేదుకాబట్టే కేంద్రమంత్రులు, ఎంపీలు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. దీని ప్రభావం తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో బీజేపీపైన నెగిటివ్ గా పడటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఈనెల 27వ తేదీన మూడు ఎంఎల్సీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఒకగ్రాడ్యుయేట్, రెండుటీచర్ ఎంఎల్సీ(MLC Elections) సీట్లభర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సీ ఎన్నికలు మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ సీటుకు ఎన్నిక జరగబోతుండగా, నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలోని మరో టీచర్ సీటుకు ఎన్నిక జరగబోతోంది. మామూలుగా బడ్జెట్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నిరక్షరాస్యుల్లో చర్చలు జరగవని అందరికీ తెలిసిందే. ప్రభామంతా చదవుకున్న వాళ్ళు, నిరక్షరాస్యులన్నతేడాలేకుండా అందరిపైనా పడతున్నా, బడ్జెట్ గురించిన చర్చలుఎక్కువగా చదువుకున్నసెక్షన్లు, మేథావుల్లోనే జరుగుతుంటుంది.
ఈనెల 27వ తేదీన జరగబోయే ఎన్నికలో ఓట్లేయబోయేది చదువుకున్న వాళ్ళు, టీచర్లే. కాబట్టి తాజా బడ్జెట్ పై పై రెండు సెక్షన్లోను ఎక్కువగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఆదాయపుపన్ను శ్లాబులసవరణ కొంతవరకు టీచర్లలో సానుకూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఏడాదికి రు. 12 లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరంలేదని కేంద్రమంత్రి బడ్జెట్లో స్పష్టంచేశారు. ఈ ఒక్క విషయంలోనే టీచర్లలో బీజేపీపై సానుకూలత కనబడే అవకాశం ఉంది. ఓవరాల్ గా తెలంగాణ డెవలప్మెంట్ విషయాన్ని తీసుకుంటే మాత్రం బడ్జెట్ పై టీచర్లు, గ్రాడ్యుయేట్లు మండిపోయే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగాల కల్పన విషయంలో బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ఊరటదక్కలేదు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి నిధుల కేటాయింపు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని గతంలోనే నిధులు సాయంచేయాలని కోరింది. అలాగే ఫోర్త్ సిటీ నిర్మాణానికి కూడా కేంద్రం ఆర్ధికసాయం చేయాలని గతంలోనే రేవంత్(Revanth) ప్రతిపాదనలు పంపించారు. హనుమకొండలో హ్యాండ్ లూమ్ పార్క్ కు నిధుల కేటాయింపు లాంటి అనేక అంశాలకు బడ్జెట్లో ఎక్కడా ఊరటదక్కలేదు. తొందరలో జరగబోయే మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానంగా తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయంగురించే బీజేపీని టార్గెట్ చేస్తాయనటంలో సందేహంలేదు. మరీప్రచారాన్ని బీజేపీ అభ్యర్ధులు, కేంద్రమంత్రులు, నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాల్సిందే.