‘ఉప ఎన్నికలకు సిద్ధం కాండి’.. పిలుపిచ్చిన కేటీఆర్
తెలంగాణలో ఉపఎన్నికలు రావడం తథ్యమని మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఉపఎన్నికలు రావడం తథ్యమని మాజీ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి వ్యాఖ్యానించారు. ఇందుకు నేతలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫిరాయింపుల నేతలకు సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసిన క్రమంలో కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. సుప్రీకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తుంటే.. తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తిప్పతలు తప్పవని అర్థమవుతోందని అన్నారు. ఫిరాయింపు నేతలను కాపాడటం ఇక కాంగ్రెస్‌కు అసాధ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీకోర్టులో ఈ ఫిరాయింపుల అంశంపై విచారణ జరుగుతోందని, ఈ విచారణ బీఆర్ఎస్‌కు అనుకూలంగానే సాగుతోందని కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అయితే పిరాయింపులపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి కేటీఆర్ పిటిషన్‌ను కూడా విచారిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. అనంతరం ఈ పిటిషన్‌లపై దర్యాప్తును ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్.. సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.