టన్నెల్‌లో రెండు మృతదేహాలున్న ప్రాంతాలను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి
x
టన్నెల్‌ లోపల నుంచి వస్తున్న క్యాడవర్ డాగ్స్

టన్నెల్‌లో రెండు మృతదేహాలున్న ప్రాంతాలను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల శుక్రవారం రెండు మృతదేహాలున్న ప్రాంతాలను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ వెల్లడించారు.


ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ప్రాంతంలో కేరళ నుంచి రప్పించిన క్యాడవర్ డాగ్స్ ఎట్టకేలకు రెండు మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించాయని తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కేరళ నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టరులో టన్నెల్ వద్దకు తీసుకువచ్చిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు ప్రాంతాల్లోనూ తవ్వకాలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం క్యాడవర్ డాగ్స్ వాటి సహాయకులు వెళ్లి టన్నెల్ లో వాసన చూపించారు.జాగిలాలు మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించడంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, మిలటరీ అధికారులు తవ్వకాలు ముమ్మరం చేశారు.




రంగంలో దిగిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపలకు శుక్రవారం ఉదయం 11.25 గంటలకు నలుగురు సభ్యులతో కూడిన అన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. రోబోటిక్ నిపుణులతో పాటు వెళుతున్న ఐ.ఐ.టి. మద్రాస్ ప్రొఫెసర్ కూడా టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ పనులను పరిశీలించారు. టన్నెల్ లోపల ఇప్పటికే కనిపించకుండా పోయిన కూలీల మృతదేహాల కోసం క్యాడవర్ శునకాలు గాలిస్తున్నాయని ఓ ఎన్టీఆర్ఎఫ్ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో...

టన్నెల్ లోపల సహాయ పనులను తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ బయట ఉండి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకొని పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన సహకారం అందిస్తున్నారు. టన్నెల్ లోపల బ్యాటరీ సమస్య, రోజ్ కట్టర్ అవసరమని సంక్షిప్త సమాచారం అందిన వెంటనే లోకో మోటార్ లో అర్వింద్ కుమార్ వాటిని పంపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసిన డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

14 రోజులు గడచినా...
టన్నెల్ కూలిపోయి శుక్రవారం నాటికి 14 రోజులు గడచింది.మార్చి 7న శుక్రవారం కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరం చేవామని, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడ కోసం రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ క్యాడవర్ శునకాలు అన్వేషణలో చేరాయని అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.



Read More
Next Story