తెలంగాణలో గంజాయి రాకెట్ గుట్టు రట్టు
తెలంగాణలో గుట్టుగా సాగుతున్న గంజాయి,డ్రగ్స్ విక్రయాలను పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణాను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీసులు దాడులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాకు చెందిన కొండబాబు, బాలకృష్ణ 13కిలోల హాష్ అయిల్ ను డబ్బాలో బెంగళూరుకు తరలిస్తుండగా సోమవారం తెల్లవారుజామున హయత్ నగర్ పోలీసులు,ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 13.5కిలోల హాష్ ఆయిల్ విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు చెప్పారు. 600 కిలోల గంజాయిని ప్రాసెస్ చేసి 13.5 లీటర్ల హాషిష్ ఆయిల్ తరయారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రవాణ
గంజాయి గుట్టు రట్టు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా పలు రాష్ట్రాలకు గంజాయి రవాణ చేస్తున్న అల్లూరి జిల్లాకు చెందిన కొండబాబు, బాలకృష్ణ ల అరెస్టుతో గంజాయి రవాణ నెట్ వర్క్ కు చెందిన సమాచారాన్ని కూపీ లాగుతున్నామని జి సుధీర్ బాబు చెప్పారు. గంజాయి రాెట్ తో ఇద్దరు నిందితులతో సంబంధాలున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి రవాణ చేస్తన్నారని తాజాగా తేలింది.
ఒడిశా నుంచి బెంగళూరుకు రవాణ
హాష్ ఆయిల్ ను ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.గంజాయి రవాణ, డ్రగ్స్ గురించి సమాచారం తెలిప్తే తమకు అందించాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని సుదీర్ బాబు చెప్పారు. వ్యవసాయం చేస్తూనే నిందితులు ఇద్దరు ఈ అక్రమ రవాణ చేస్తున్నారని సమాచారం.
ఆపరేషన్ ధూల్ పేట
నాడు గుడుంబా విక్రయాలకు కేంద్రంగా మారిన ధూల్ పేట నేడు గంజాయి రవాణాకు కేంద్రంగా మారింది. హైదరాబాద్ నగరం మొత్తం ధూల్ పేట కేంద్రంగా రవాణ చేస్తున్నారని తేలడంతో తెలంగాణ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఆపరేషన్ ధూల్ పేట కార్యక్రమం చేపట్టారు. ఆగస్టు 15వతేదీలోగా గంజాయిని పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ధూల్ పేటలోని ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ధూల్ పేట మహిళలే ఎక్కవుగా ఈ గంజాయి స్మగ్లింగ్ లో పాల్గొంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు, ఎక్జైజ్ అధికారులు గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకొని ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
Next Story