కూకట్ పల్లి జెఎన్టియు వంతెనపై కారు భీభత్సం
x

కూకట్ పల్లి జెఎన్టియు వంతెనపై కారు భీభత్సం

ఇద్దరు సూడాన్ యువకులు అరెస్ట్


అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కూకట్ పల్లి జెఎన్ టియు వంతెనపై భీభత్సం సృష్టించింది. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. సూడాన్ కు చెందిన ఇద్దరుయువకులతో బాటు కారులో మరో ముగ్గురు యువతులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యువతులు మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. సూడాన్ యువకులు శంషాబాద్ లో నివాసముంటున్నారు. చదువుల నిమిత్తం సూడాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన సూడాన్ యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదివారం ఉదయం 7 50 నిమిషాలకు కూకట్ పల్లి రైతుబజార్ దాటిన వెంటనే కారు జెఎన్ టియు వంతెన ఎక్కింది. అతి వేగంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడపడంవల్ల తొలుత డివెడర్ ను, తర్వాత ద్వి చక్రవాహాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భీభత్సం సృష్టించిన కారు రెంట్ కు తీసుకున్నారా? మరెవరైనా ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మితిమీరిన వేగం వల్ల హైదరాబాద్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Read More
Next Story