Pushpa 2 | అల్లు అర్జున్, ఆయన టీమ్‌పై కేసు నమోదు..
x

Pushpa 2 | అల్లు అర్జున్, ఆయన టీమ్‌పై కేసు నమోదు..

సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యుడా? లేక థియేటర్ యాజమాన్యమా? పోలీసులేమంటున్నారు..


‘పుష్ప-2: ది రూల్’(Pushpa 2) సినిమా ప్రీమియర్ షోలో భాగంగా అపశృతి నెలకొంది. ప్రీమియర్ సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్(Allu Arjun) రావడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడంటూ అనేక మంది మండిపడుతున్నారు. ఇంతటి హైప్ ఉన్న సినిమా ప్రీమికర్ సమయంలో హైదరాబాద్‌లోని టాప్ థియేటర్లో ఒకటైన సంద్య థియేటర్‌కు ఆయన ఎలా వెళతారని, ఆయన ఆలోచనారహితం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని అనేక మంది ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తమ అభిమాన హీరో కనిపించగానే.. ఒళ్లు మరిచి పరుగులు పెట్టాల్సినంత అవసరం ఏముందని, వాళ్లైన కాస్తంత తమాయించుకుని, ఆర్డర్ పాటించి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయం కీలక మలుపు తీసుకుంది. తొక్కిసలాటలో జరిగిన ప్రాణ నష్టానికి అల్లు అర్జున్, ఆయన టీమ్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, ఆయన టీమ్‌పై కేసు నమోదైంది. ఈ విషయాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు.

థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కూడా కేసు నమోదైంది. బీఎన్‌ఎస్ చట్టంలోని 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని తెలిపారు. ప్రీమియర్ షో సమయంలో థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి కూడా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా థియేటర్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. అదు విధంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి 9:90 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో వేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాను తిలకించడం కోసం సినిమాలోని కీలక నటులు థియేటర్‌కు వస్తారన్న సమాచారం పోలీసులకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదు. పైగా థియేటర్ యాజమాన్యం కూడా ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపు చేయడం కోసం థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌ో ఎటువంటి ప్రత్యేక ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రి 9:40 గంటలకు తన వ్యక్తిగత భద్రతతో అల్లు అర్జున్.. థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభించారు. వారికి అదుపు చేసే క్రమంలో భద్రతా సిబ్బంది వారిని నెట్టేయడం ప్రారంభించారు’’ అని తెలిపారు.

‘‘అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసి పోయింది. ఈ క్రమంలో తోపులాట మొదలైంది. అది కాస్తా క్షణాల వ్యవధిలోనే తొక్కిసలాటగా మారింది. ఈ క్రమంలోనే దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవంత్ కుటుంబం కిందపడిపోయింది. వారిని గమనించిన పోలీసులు.. వెంటనే వారిని బయటకు లాగారు. రేవతి కుమారుడు శ్రీతేజకు వెంటనే సీపీఆర్ చేసి.. దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కాగా రేవతి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో బాలుడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ వెల్లడించారు.

Read More
Next Story