
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ కు అస్వస్ధత
విషయాన్ని గుర్తించిన డైరెక్టర్ (CBI Director Praveen Sood)వ్యక్తిగత సిబ్బంది సూద్ ను నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్రీశైలం నుండి హైదరాబాదుకు శనివారం తిరిగి వస్తుండగా అస్వస్ధతకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన డైరెక్టర్ (CBI Director Praveen Sood)వ్యక్తిగత సిబ్బంది సూద్ ను నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సీబీఐ డైరెక్టర్(CBI Director Hospitalized) శుక్రవారం హైదరాబాద్ (Hyderabad)కు చేరుకున్నారు. శ్రీశైలం(Sri Sailam Temple)లో దైవ్యదర్శనంతో పాటు హైదరాబాద్ లోని అధికారుల పనితీరుపై సమీక్ష పెట్టుకున్నారు. శనివారం ఉదయం దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్ లో సమీక్ష పూర్తిచేసుకోవాలన్నది సూద్ షెడ్యూల్.
అనుకున్నట్లే శనివారం ఉదయం శ్రీశైలంలో దైవ దర్శనం తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాదు దగ్గరకు వచ్చిన తర్వాత హఠాత్తుగా అస్వస్ధతకు గురయ్యారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంశంపై స్ధానిక అధికారులతో సూద్ సమావేశం కూడా నిర్వహించారు. డైరెక్టర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే సీబీఐ సీనియర్ అధికారులు హైదరాబాదులోని ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అనారోగ్యానికి కారణాలు తెలియాల్సుంది. సాయంత్రం సూద్ ఆరోగ్యానికి సంబందించి వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని సమాచారం.