బిగ్ బ్రేకింగ్ : కాళేశ్వరం విచారణ ప్రారంభించిన సీబీఐ
x
KCR

బిగ్ బ్రేకింగ్ : కాళేశ్వరం విచారణ ప్రారంభించిన సీబీఐ

కాళేశ్వరంకు సంబంధించిన ఫైళ్ళను సిట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో పాటు విజిలెన్స్ కమిషన్ రిపోర్టును కూడా సీబీఐ తీసుకున్నది


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం సీబీఐ(CBI)ని కోరిన విషయం తెలిసిందే. ఈనెల మొదట్లో జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరం(Kaleshwaram Corruption) అవినీతి, అవకతవకలపై పెద్దఎత్తున చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చర్చల చివరలో రేవంత్ మాట్లాడుతు కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతన్నట్లు ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తు చీఫ్ సెక్రటరీ కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. తెలంగాణ(Telangana)ప్రభుత్వ రిక్వెస్టుకు కేంద్రహోంశాఖ సానుకూలంగా స్పందించింది.

కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తుచేసేందుకు కేంద్ర హోంశాఖ సీబీఐలోని కొందరు అధికారులను ప్రత్యేకంగా నియమించింది. దాంతో సీబీఐ అధికారులు గురువారం రంగంలోకి దిగారు. కాళేశ్వరంకు సంబంధించిన ఫైళ్ళను సిట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో పాటు విజిలెన్స్ కమిషన్ రిపోర్టును కూడా తీసుకున్నారు. ఫైళ్ళ పరిశీలనతో దర్యాప్తును మొదలుపెట్టినట్లయ్యింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) రిపోర్టు ఆధారంగా సిఫారసుచేసింది. అందుకనే ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా సీబీఐ తీసుకుని పరిశీలిస్తోంది. రిపోర్టుల పరిశీలన, ప్రాజెక్టు సందర్శన తొందరలోనే పూర్తిచేయబోతున్నట్లు సమాచారం. రికార్డుల పరిశీలన మొదలైందంటేనే సీబీఐ విచారణ ప్రారంభైనట్లు లెక్క.

గ్రౌండ్ వర్క్ పూర్తయిన తర్వాత బాధ్యులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటు చాలామంది ఉన్నతాధికారులు, నిర్మాణకంపెనీలోని కీలకవ్యక్తులపై కేసులునమోదుచేసే అవకాశాలున్నట్లు ప్రచారం మొదలైపోయింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story