జరూర్ ఆనా హమారే హైదరాబాద్  అందాల తారలకు ఆహ్వానం
x
మంచు లక్ష్మీ మిస్ వరల్డ్ పోటీల ప్రచారం

'జరూర్ ఆనా హమారే హైదరాబాద్ ' అందాల తారలకు ఆహ్వానం

‘హైదరాబాద్ జరూర్ ఆనా’ అంటూ మంచు లక్ష్మి, పీవీ సింధూ, నిఖత్ జరీన్ వీడియోలను విడుదల చేశారు.


హైదరాబాద్ నగరంలో 72 మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ సెలబ్రిటీలతో ప్రచారం ఆరంభించింది. హైదరాబాద్ నగరంలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల గురించి తెలంగాణ సెలబ్రిటీలు, స్పోర్ట్సు సార్లు ప్రచారం చేస్తున్నారు.



మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు ‘ జరూర్ ఆనా హమారే హైదరాబాద్’ (Zarur A అంటూ ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి, క్రీడాకారిణులు పీవీ సింధూ, నిఖత్ జరీన్ ల వీడియోలను తెలంగాణ పర్యాటక శాఖ విడుదల చేసింది.




హైదరాబాద్ కు రండి అంటూ పీవీ సింధూ పిలుపు

72వ ప్రపంచ అందాల పోటీల వేడుకలు హైదరాబాద్ నగరంలో హోరెత్తుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచాన్ని తన సొంత రాష్ట్రానికి ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధూ స్వాగతించారు. తెలంగాణ 72వ మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో, స్పోర్ట్సు ఛాంపియన్ సింధూ స్వయంగా వీడియో ప్రచారం చేశారు. భారతదేశం అందం, సంస్కృతి, ఐక్యత తో కూడిన ఈ ప్రపంచ వేడుక కోసం ఉత్సాహాన్ని పంచుకుందాం రండి తెలంగాణకు అంటూ (Telangana Zarur aana)పీవీ సిందూ పిలుపునిచ్చారు.



మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకు గర్వ కారణం : మంచు లక్ష్మీ

మిస్ వరల్డ్ పోటీల (Global Celebration of Beauty) సందర్భంగా ప్రముఖ సినీనటి మంచు లక్ష్మీ వీడియోను తెలంగాణ పర్యాటక శాఖ సోమవారం విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్కారం హైదరాబాద్ లో జరుగుతున్న 72 వమిస్ వరల్డ్ పోటీలను సూపర్ సక్సెస్ గా చేద్దాం మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం’’ అని మంచు లక్ష్మీ వీడియోలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఉత్సాహభరితమైన సంప్రదాయాలు, రంగులు, సాంస్కృతిక గొప్పతనాన్ని చాటే పోటీదారులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అంటూ మంచు లక్ష్మీ పేర్కొన్నారు.


హైదరాబాద్ జరూర్ ఆనా : నిఖత్ జరీన్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ రాష్ట్ర డీఎస్పీ నిఖత్ జరీన్ ప్రచార వీడియోను తెలంగాణ పర్యాటక శాఖ ఆదివారం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. మిస్ వరల్డ్ 2025 పోటీలు మన హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి.ఇవీ అందాల పోటీలే కాదు మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, మహిళా సాధికారత, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుకునే అవకాశం. అందాల సుందరులు,తెలివిగల ముద్దుగుమ్మలు ప్రపంచంలోని 120 దేశాల నుంచి తరలిరానున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే అందాల సుందరీమణులను నిఖత్ జరీన్ అభినందించార.ఈ పోటీలు మర్చిపోలేని విదంగా నిర్వహిద్దామంటూ నిఖత్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక ప్రాభవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించబోతున్నాం, హైదరాబాద్ జరూర్ ఆనా అంటూ నిఖత్ జరీన్ వీడియోలో కోరారు.




మిస్ వరల్డ్ పోటీలకు విమానాశ్రయం ముస్తాబు

ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. దీనికోసం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక లాంజ్ లతో పాటు, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.తెలంగాణ పర్యాటక ప్రాంతాలు,ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 'తెలంగాణ జరూర్ ఆనా' (Must Visit Telangana) నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.



Read More
Next Story