తెలుగు మంత్రులకు శాఖలు కేటాయించిన బీజేపీ సర్కార్
బీజేపీ అధిష్టానం కేంద్రమంత్రులకు శాఖలను ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర క్యాబినెట్ కి ఎంపికైన ఎంపీలకు పోర్టుఫోలియోలు ఫిక్స్ చేసింది.
బీజేపీ అధిష్టానం కేంద్రమంత్రులకు శాఖలను ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర క్యాబినెట్ కి ఎంపికైన ఎంపీలకు పోర్టుఫోలియోలు ఫిక్స్ చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ - హోం శాఖ సహాయ మంత్రి పదవులు దక్కాయి. ఇక ఏపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ, శ్రీనివాసవర్మకి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయమంత్రి పోర్టుఫోలియోలు కేటాయించింది.
ఇతర మంత్రులకు ఏఏ శాఖలు ఖరారు చేసిందంటే...
అమిత్ షాకు మళ్లీ కేంద్ర హోంశాఖ, నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ, రాజ్‌నాథ్‌కు మళ్లీ రక్షణశాఖ, నిర్మలాసీతారామన్‌కు మళ్లీ ఆర్థికశాఖ.. జయశంకర్‌కు మళ్లీ విదేశాంగ శాఖలు కేటాయించింది.
జేపీ నడ్డాకి వైద్యం,
మనోహర్‌లాల్ కట్టర్- గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి,
హర్దీప్‌సింగ్ పూరి-పెట్రోలియం,
అశ్విని వైష్ణవ్-రైల్వే, సమాచార, ప్రసారశాఖ,
పీయూష్ గోయల్-వాణిజ్యం,
ధర్మేంద్ర ప్రధాన్-విద్యాశాఖ,
భూపేంద్రయాదవ్-పర్యావరణం,
మన్‌సుఖ్ మాండవీయ-కార్మికశాఖ, క్రీడలు,
కిరణ్ రిజిజు-పార్లమెంట్ వ్యవహారాలు,
జితిన్ రామ్ మాంఝీ-చిన్న, మధ్య తరహా పరిశ్రమలు,
గజేంద్రసింగ్ షెకావత్- టూరిజం, సాంస్కృతిక శాఖ,
శ్రీపాదనాయక్-విద్యుత్ శాఖ,
సీఆర్ పాటిల్-జలశక్తి,
చిరాగ్ పాశ్వన్-క్రీడలు,
శర్బానంద సోనోవాల్-ఓడరేవులు, షిప్పింగ్,
అన్నపూర్ణాదేవి-మహిళా శిశు సంక్షేమం,
శివరాజ్‌సింగ్ చౌహాన్-వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి,
శోభ కరంద్లాజే-చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి,
రావ్ ఇంద్రజిత్ సింగ్ - సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి,
జ్యోతిరాదిత్య సింధియా-టెలికాం శాఖ,
ప్రహ్లాద్ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు,
కుమారస్వామి-ఉక్కు, భారీ పరిశ్రమలు,
సురేష్ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి