
చంద్రబాబు ‘బనకచర్ల’ ను తిప్పి పంపిన కేంద్రం
ముందు ఆంతర్రాష్ట్ర వివాదాలను తెల్చుకున్నాకే మాదగ్గిరకు రండి అన్న నదీజలాల నిపుణల కమిటి
ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజజక్టు పోలవరం-బనకచర్ల ఎత్తిపోతల నిర్మాణానికి నదీజల ప్రాజక్టులను అంచనా వేసే కేంద్ర పర్యావరణ నిపుణుల మంది కమిటీ (Expert Appraisal Committee (EAC) for River Valley Projects) అనుమతి నిరాకరించింది.
సోమవారం నాడు ఈ కమిటీ ౩౩వ సమావేశమయింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ఈ ప్రాజక్టుకు వ్యతిరేకంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు, జలసంఘానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించింది. వరద జలాల అందుబాటు మీద ఆంధ్రప్రదేశ్ వాదనన ఊరికే అంగీకరించకుండా గోదావరినదిలో ఏమాత్రం వరదజలాలు ఉన్నాయో కేంద్రజలసంఘం (CWC)ని సంప్రదించి తేల్చుకోవలని ఈ కమిటీ సూచించింది.
అంతేకాదు, పోలవరం సమస్యే ఇంకా పరిష్కారం కాలేదు. చత్తీష్ గడ్, తెలంగాణ, ఒదిశా రాష్ట్రాలు పోలవరం ప్రాజక్టు సమస్య ఉందంటున్నాయి. అలాంటపు అసలు సమస్యపరిష్కారం కానపుడు మళ్లీ పోలవరం మల్టీ పర్పస్ ప్రాజక్టనుంచి రాయలసీమ కరువు ప్రాంతానికి నీళ్లుంటు ఈ ప్రాజక్టును ఎలా చేపడతారని పేర్కొంది.
గోదావరి జలాలను నుంచి పెన్నా బేసిన్ లోకి తరలించేందుకు చేపట్టాలనుకున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ అంతర్రాష్ట్ర సమస్య అని అలాంటపుడు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాకుండా పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఈమదింపు కమిటి ప్రాజక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజక్టును ప్రతిపాదించినప్పటి నుంచి తెలంగాణ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ ప్రాజక్టుకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బిఆర్ ఎస్ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చిత్రమేమిటంటే, ఈ ప్రాజక్టుకు తెలుగుదేశం దాని మిత్ర పక్షాలు తప్ప ఇతర పార్టీలు, మేధావులు, రైతు సంఘాల నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీకి ఎవ్వరు మద్దతు నీయడం లేదు. అయినా సరే, చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. ఈ దశలో కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పిపంపింది.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నందున ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రాజక్టుకు సంబంధించి సంపూర్ణమయిన అధ్యయనం జరగాలని సూచించింది.
మొదట ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోరేముందు నీటిలభ్యత, ప్రాజక్టు మీద ఉన్న అంతర్రాష్ట్రవివాదాలను పరిష్కరించుకోవాలని దీనికోసం ముందు కేంద్ర జల సంఘం (CWC) ను సంప్రదించాలని కేంద్రం సూచించింది. అదే విధంగా, ఈ ప్రాజక్టు నిర్మాణం 1980లో వచ్చిన గోదావరి జల వివాద అవార్డుకు వ్యతిరేకంగా ఉందేమో కూడా అధ్యయనం చేయాలని కేంద్రం సూచించింది. అంతేకాదు, ఈ ప్రాజక్టును క్షుణ్ణంగా పరిశీలించాలని, పర్యావరణ అనుమతులీయడానికి అవసరమయిన షరతు (Terms of Reference) లను కూడా తయారు చేయాలని కమిటీ కేంద్ర జలసంఘాన్ని కోరింది.
సముద్రంలో కలిసే గోదావరి నది మిగుల జలాలను మళ్లించి రాయలసీమ జిల్లాలకు అందించేందు ఈ ప్రాజక్టు, దీని వల్ల తెలంగాణ ఎటువంటి నష్టం లేదని చంద్రబాబు ప్రభుత్వం వాదిస్తున్నది. అందుకోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఏపీ చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీని మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది పలువురి అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తితోపాటు పలు శాఖల మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివేదించారు. తమ మిత్రపక్షమని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజక్టుకు అనుమతిస్తే తాము కోర్టుకు వెళతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇదే సమయంలో ఈ ప్రాజక్టును ప్రతిపాదనను విరమించుకోవాలని పలువురు మేధావులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రతిపాదలను వెనక్కి పంపింది.
బిఆర్ ఎస్ హర్షం
కేంద్ర జలసంఘం (CWC), గోదావరి జల వివాదల ట్రిబ్యునల్ (GWDT) పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఇరిగేషన్ మంత్రి, బిఆర్ ఎస్ నాయకుడు టి హరీష్ తెలిపారు.
ఇది @BRSparty పోరాటం విజయం. తెలంగాణ ప్రజల విజయంమని ఎక్స్ లో రాశారు.
Central Water Commission (CWC), GWDT పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) June 30, 2025
ఇది @BRSparty పోరాటం విజయం. తెలంగాణ ప్రజల విజయం.
బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా…
“బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం,” అని ఆయన వ్యాఖ్యానించారు.