
నందమూరి కుటుంబంలో విషాదం..
నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మృతి. హైదరాబాద్‌కు బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు.
నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. నందమూరి జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ.. మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంతా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆమె మరణంపై చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్థిన్నట్లు పేర్కొన్నారు. ‘‘బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరు పద్మజ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
పద్మజ మరణంపై నారా లోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి, పద్మజ అత్త కన్ను మూశారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మా కుటుంబానికి అన్నివేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.