సురవరంతో కలిసి పోరాటాలు చేశాం: చంద్రబాబు
x

సురవరంతో కలిసి పోరాటాలు చేశాం: చంద్రబాబు


సీపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగానే సురవరంతో ఉన్న అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం సురవరం చేసిన సేవలను, పోరాటాలను ఆయన గుర్తు చేశారు. ప్రజలే శ్వాసగా గడిపిన నేత సురవరం సుధాకర్ అని చంద్రబాబు కొనియాడారు.

కలలో సైతం ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారని, ఆయన అనుక్షణం ప్రజల సంక్షేమమే కోరుకున్నారని అన్నారు. సురవరంతో తనకు సుదీర్ఘమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. గతంలో తాము కలిసి ఎన్నో పోరాటాలు చేశామని చెప్పారు. దేశ రాజకీయాల్లో సురవరం కీలక పాత్ర పోషించారని, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన ఎన్నో సేవలందించారని తెలిపారు.

‘‘నేనంటే సురవరంకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయనను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. వ్యక్తిగతంగా నేను చేసే పనులను ఆయన ప్రోత్సహించేవారు. అలాంటి ఒక మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణం సీపీఐకి ఎంత నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం. ప్రత్యేకంగా దేశానికి, రాష్ట్రానికి తీవ్ర, తీరని నష్టం. ఆయన సేవాభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని చంద్రబాబు అన్నారు.

Read More
Next Story