హైదరాబాద్ పర్యటనకు సీఈసీ జ్ఞానేష్ కుమార్
x

హైదరాబాద్ పర్యటనకు సీఈసీ జ్ఞానేష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర బూత్ స్థాయి అధికారులతో రవీంద్రభారత్ ఆడిటోరియంలో సమావేశం.


భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్.. హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నగరంలోని పలు చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర బూత్ స్థాయి అధికారులతో రవీంద్రభారత్ ఆడిటోరియంలో సమావేశమవుతారు. అందులో పలు కీలక విషయాలను అధికారులకు వివరించనున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

శుక్రవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్లనున్నారు. అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆయన శ్రీశైల పర్యటన పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక అంశాలకు పరిమితం కానుంది.

Read More
Next Story