గవర్నరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.రాష్ట్రంలో ప్రారంభమైన కులగణన సర్వే గురించి సీఎం గవర్నరుకు వివరించారు.
రాజ్ భవన్ లో బుధవారం రాత్రి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తో భేటీ అయిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.
- రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన తీరు గురించి సీఎం రేవంత్ గవర్నరుకు వివరించారు.ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను గవర్నర్ కు సీఎం వివరించారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సీఎం తెలిపారు.
- 2025వ సంవత్సరంలో చేపట్టే దేశవ్యాప్త జనగణనలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నరు జిష్ణుదేవ్ వర్మను కోరారు.ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) November 6, 2024
రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన కుల గణన, దాని అవశ్యకత, అనుసరిస్తోన్న విధానం పై గవర్నర్ గారికి వివరించడం జరిగింది.@Jishnu_Devvarma pic.twitter.com/0Ys2nfo1kM
Next Story