జానీ మాస్టర్ కేసుపై అందుకే మాట్లాడలేకున్నాం.. అని మాస్టర్
x

జానీ మాస్టర్ కేసుపై అందుకే మాట్లాడలేకున్నాం.. అని మాస్టర్

జానీ మాస్టర్ కేసు వ్యవహారంపై మహిళా డాన్స్ కొరియోగ్రాఫర్ అని మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ చాలా మంచి వారని, నిరపరాధని అన్నారు.


జానీ మాస్టర్ కేసు వ్యవహారంపై మహిళా డాన్స్ కొరియోగ్రాఫర్ అని మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ చాలా మంచి వారని, నిరపరాధని అన్నారు. జానీపై లైంగిక ఆరోపణల కేసు పెట్టిన విషయం తెలిసి షాకయ్యానని, అదే విధంగా జానీకి వచ్చిన జాతీయ పురస్కారం రద్దు కావడం తనను ఎంతగానో బాధించిందని అని మాస్టర్ చెప్పుకొచ్చారు. అవార్డు అన్నది ఒకరి ప్రతిభకు చిహ్నం లాంటిదని, అలాంటిది వచ్చి అవార్డు రద్దయితే అది తీవ్ర అవమానకరంగా ఉంటుందని, జానీ తప్పు చేసినట్లు ఎప్పటి వరకు తేలలేదని, ఆధారాలు కూడా ఏమీ లభించలేదని ఆమె అన్నారు. తాను జానీ మాస్టర్ దగ్గర రెండు సంవత్సరాలు పనిచేశానని, జానీ ఎలాంటి వారో తనకూ చాలా బాగానే తెలుసని చెప్పుకొచ్చారు. జానీ లాంటి మాస్టర్ దొరకడం చాలా అదృష్టం చేసుకుంటే కానీ అందే అవకాశం కాదని వ్యాఖ్యానించారామే.

జానీ జైల్లో ఉండటం కరెక్ట్ కాదు

‘‘జానీ మాస్టర్ నాకు గురువు. ఆయన జైల్లో ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది అమ్మాయి విషయం, సెన్సిటివ్ కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా. ఎవరూ మాట్లాడలేకపోవడానికి కూడా ఇదే కారణం. ఏ యూనియన్‌లో అయినా సమస్యలు ఉంటాయి. ఎవరైనా డాన్సర్‌కు ఇబ్బందులు ఉన్నాయంటే సహాయం చేయడానికి జానీ, శేఖర్, భాను మాస్టర్లే ముందుంటారు. డాన్స్ మాస్టర్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గతంలో ఇప్పుడు జానీపై కేసు పెట్టిన వ్యక్తికి యూనియన్ కార్డు ఇప్పించాలని జానీ మాస్టర్ వైఫ్ గట్టిగా అడిగారు. కానీ యూనియన్ కార్డు రావాలంటే నియమనిబంధనలు అనేవి కొన్ని ఉంటాయి. ఎలా పడితే అలా ఇవ్వడానికి వీలు పడదు. జానీ తన అధ్యక్ష పదవిని అడ్డుకు పెట్టుకుని విక్టిమ్‌కు యూనియన్ కార్డు లేకుండా చేశారనడం సమంజసం కాదు’’ అని అని మాస్టర్ చెప్పుకొచ్చారు.

‘హీరోయిన్ కావాలని ఉంది’

‘‘గతంలో ఒకసారి సదరు బాధితురాలు తనకు మంచి హీరోయిన్ కావాలని ఉందని కూడా నాకు చెప్పింది. కానీ ముందు మంచి డాన్సర్ అవ్వమని చెప్పాను. ఆ తర్వాత ఆమె జానీ దగ్గర డాన్స్ నేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా లైంగిక దాడుల కేసు పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది కాబట్టి మేము పెద్దగా మాట్లాడదల్చుకోలేదు. కానీ ఈ కేసులో కోర్టు జడ్జిమెంట్ ఏమని ఇస్తుందా అని అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని అని మాస్టర్ వివరించారు.

జానీ నాకు దేవుడు..

‘‘జానీ మాస్టర్ నాకు గురువు. నేను ఆయనను దేవుడిలా చూస్తాను. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరం. తప్పు చేస్తే శిక్ష పడాలి. కానీ ఒకవేళ జానీ నిరపరాధి అని తేలితే ఏంటి..? ఒక లేడి కొరియోగ్రాఫర్‌గా చెప్తున్నా.. ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా కష్టపడాలి. కెరీర్‌లో ఎప్పుడూ నాకు కాస్టింగ్ కౌచ్ అన్న సమస్యే ఎదురుకాలేదు. ఇప్పుడు ఈ బాధితురాలు కూడా కొన్నాళ్లు జానీని దేవుడు అని చెప్పింది. జానీతో వర్క్ చేసే సమయంలో బాధితురాలు బాధగా ఉండటం ఎప్పుడూ జరగలేదు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా వచ్చి ఆరోపణలు చేసి కేసులు పెడితే ఎలా చూడాలి..’’ అని అనుమానాలు వ్యక్తం చేశారు అని మాస్టర్.

Read More
Next Story