
జగన్ మోహన్ రావు బాగోతం బయటపెట్టిన సిఐడి
హెచ్ సిఏ స్కాం ఇన్వెస్టిగేషన్ లో విస్తుపోయే నిజాలు
హెచ్ సిఏ స్కాంలో విస్తుపోయే నిజాలు వెల్లడౌతున్నాయి. హెచ్ సిఏ స్కాంలో ఊరుపేరు లేని క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకున్న సభ్యులే హెచ్ సిఏ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నట్టు సిఐడి విచారణలో వెల్లడైంది. బిఆర్ఎస్ శ్రేణులే ఈ క్లబ్బుల్లో సభ్యులుగా ఉన్నారని సమాచారం . శ్రీచక్ర క్లబ్ అధ్యక్షురాలు కవితాయాదవ్ ఆమె భర్త రాజేందర్ యాదవ్, గౌలిపురా మిత్ర క్లబ్ అధ్యక్షుడైన కృష్ణాయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. హెచ్ సిఏ అధ్యక్షుడైన జగన్ మోహన్ రావు ప్రస్తుతం ఈ ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడు. మొత్తం ఐదుగురు నిందితులను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. పరారీలో మరో ఐదుగురు నిందితులున్నారు. ఈ స్కాంలో మరో కీలక నిందితుడు దేవరాజ్ కోసం సిఐడి ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయి. నిందితులను తమకు అప్పగించాలని సిఐడి వేసిన పిటిషన్ ను మల్కాజ్ గిరి కోర్టు అంగీకరించింది. ఆరు రోజుల పాటు సిఐడి కస్టడీలో ఉన్న జగన్ మోహన్ రావును విచారిస్తోంది. 23 క్లబ్బులకు చెందిన వోటర్ల వల్లే తాను హెచ్ సిఏ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్టు జగన్మోహన్ రావు అంగీకరించారు. ఈ క్లబ్బులో బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్టు జగన్ మోహన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. కృష్ణాయాదవ్ బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని జగన్ మోహన్ రావు లబ్ది పొందినట్టు ప్రచారంలో ఉంది. కృష్ణాయాదవ్ సంతకాన్ని తమ్ముడు రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితా యాదవ్ ఫోర్జరీ చేసిన విషయం కృష్ణాయాదవ్ కు తెలియకపోవచ్చని సిఐడి అధికారులు అంటున్నారు. ఐఏఎస్ , ఐపిఎస్ అధికారులు సైతం ఈ క్లబ్బులో సభ్యత్వం తీసుకున్నారు. కెటిఆర్ , కవిత ప్రభావంతో వీళ్లంతా జగన్ మోహన్ రావుకు ఓటేసినట్లు తెలుస్తోంది. సిఐడికి కొన్ని క్రికెట్ అసోసియేషన్లు ఇచ్చిన ఫిర్యాదులో కూడా కెటిఆర్, కవిత పేర్లు ఉండటం గమనార్హం.
ప్లేట్ భోజనం రెండువేల రూపాయలు పెట్టి హెచ్ సిఏ అక్రమాలకు పాల్పడింది.కరెంట్ బిల్లులను సైతం హెచ్ సిఏ కట్టకపోవడంతో పవర్ కట్ చేసన సందర్బాలు అనేకం. బిఆర్ఎస్ అధికారంలో ఉండటంతో జగన్ మోహన్ రావు మళ్లీ కరెంట్ ను పునరుద్దరించుకున్నట్లు ఆరోపణలున్నాయి.