చెన్నమనేనిపై సీఐడీ కేసు.. ఈసారి సర్టిఫికెట్లు..
x

చెన్నమనేనిపై సీఐడీ కేసు.. ఈసారి సర్టిఫికెట్లు..

భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ చెన్నమనేనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.


వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాకులపైన షాకులు తగులుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్‌తో 15ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటంలో చెన్నమనేనిని ఓటమి పలకరించింది. రూ.25లక్షల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం. కాగా తాజాగా ఆయనపై సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ చెన్నమనేనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి తమ కార్యాలయానికి రావాలని ఆదిశ్రీనివాస్‌ను కోరారు అధికారులు.

చెన్నమనేని పౌరసత్వం అంశం ఇప్పటి నుంచి కాదు పదిహేళ్ల నుంచి కొనసాగుతున్న విషయం. గతేడాది డిసెంబర్ 9న చెన్నమనేని ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యే కాకుండా ఆదిశ్రీనివాస్‌కు గండికొట్టిన కారణంగా ఆయన రూ.25లక్షలు చెల్లించాలని, లీగల్‌సెల్‌కు మరో రూ.5లక్షలు చెల్లించాలని చెన్నమనేనిని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సమస్య ముగిసిందనుకునే లోపే ఇప్పడు ఈ విషయంలోకి సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం చెన్నమనేని తప్పుడు సర్టిఫికెట్లను అఫిడవిట్‌లో చూపించారన్న అంశంపై సీఐడీ దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story