
నాలుగోసారి 10వ తరగతి పేపర్ లీక్
పదవతరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంలో తెలగాణ ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోంది.
పదవతరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంలో తెలగాణ ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోంది. పరీక్షలు మొదలైన దగ్గర నుండి క్వశ్చన్ పేపర్లు లీకవుతునే ఉన్నాయి. నాలుగురోజుల్లో నాలుగో ప్రశ్నపత్రం లీకవటం సంచలనంగా మారింది. ప్రశ్నపత్రాలు లీక్(Math's Question paper leak) కాకుండా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఉపయోగం కనబడటంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే కామారెడ్డి మండలంలోని జుక్కల్ మండల జిల్లా పరిషత్ స్కూల్(Jukkal High School) నుండి లెక్కల పేపర్ బుధవారం లీకయ్యింది. పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం బయటకు వచ్చేసింది. నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్ సెంటర్లలో ప్రశ్నపత్రాల లీకేజీని జనాలు మరువకముందే జుక్కల్ కేంద్రం నుండి క్వశ్చన్ పేపర్ లీకవ్వటంతో ప్రభుత్వం తలపట్టుకుంది.
పరీక రాస్తున్న ఒక స్టూడెంట్ లెక్కల పేపర్ ప్రశ్నల్లో కొన్నింటిని ఒక కాగితంపై రాసి బయటకు పంపాడు. తర్వాత కొద్దిసేపటికి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసిన మరోపేపర్ క్వశ్చన్ పేపర్ బయటకు పంపిన అబ్బాయికి అందింది. ఆ అబ్బాయి నుండి మరికొందరు విద్యార్ధులు సమాధానాలను తెలుసుకుని మాస్ కాపీయింగుకు పాల్పడ్డారు. దాంతో పేపర్ లీక్ విషయం బయటపడింది. పైగా సమాధానం పేపర్ తో పాటు క్వశ్చన్ పేపర్ కూడా సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొట్టటంతో విషయం బట్టబయలైంది. దాంతో ప్రశ్నపత్రం లీకేజీ విషయం ఉన్నతాధికారులకు చేరటంతో విచారణ మొదలైంది. విచారణలో క్వశ్చన్ పేపర్ లీకైన విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించారు.
పరీక్షకేంద్రంలో డ్యూటీచేసిన చీఫ్ సూపరెండెంట్ సునీల్, డిపార్టమెంట్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర దీపకలను విధుల నుండి తొలగిస్తు డీఈవో బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. కొన్ని స్కూళ్ళల్లోని టీచర్లు తమ స్కూళ్ళకు 100 శాతం పాస్ రిజల్టు రావాలన్న ఉద్దేశ్యంతోనే అడ్డదారుల్లో మాస్ కాపీయింగుకు దారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. లెక్కల పేపర్ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన కొందరు మీడియావాళ్ళపైన కూడా పోలీసులు కేసులు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికి ఎనిమిదిమందిని అరెస్టుచేసి విచారణ చేస్తున్నారు.