
పెట్టుబడులకు ముందుకు రావాలి
కెనడా హై కమిషనర్ తో సిఎం సమావేశం
తెలంగాణలో పెట్టు బడులు పెట్టడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్ ను కోరారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పెట్టుబడులకు సంబంధించి కెనడా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలోనే తెలంగాణలో పెట్టు బడులు పెట్టడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. సచివాలయంలో ఈ భేటి జరిగింది. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కెనడా హై కమిషనర్ కు వివరించారు.
ప్రెంచ్ బృందంతో..
అలాగే ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్క్ లామి బృందం కూడా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్రెంచ్ ప్రాజెక్టులను సమీక్షించడానికి సిఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. నగరంలో తమ పెట్టుబడులను పెంచుకోవాలని , హైదరాబాద్‌లో ఫ్రెంచ్ బ్యూరో ఉనికిని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ని ఫ్రెంచ్ ప్రతినిధులు కోరారు.
హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృంద సభ్యులని సీఎం కోరారు ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

