ప్రజావాణి చొరవతో బాలికకు పునర్జన్మ
x
CM Prajavani

ప్రజావాణి చొరవతో బాలికకు పునర్జన్మ

రు. 9 లక్షల ఆర్ధికసాయం అందించిన సీఎం ప్రజావాణి


ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం చొరవతో బాలిక సౌమ్యకు పునర్జన్మ లభించింది. విషయం ఏమిటంటే సౌమ్య అనే బాలిక ఊపిరితిత్తుల సమస్యతో చాలాకాలంగా ఇబ్బందిపడుతోంది. సమస్య బాగా పెరిగిపోయి ప్రాణాపాయ స్ధితిలోకి వెళిపోయింది. వైద్యం చేయించుకునేందుకు లక్షలరూపాయలు లేనికారణంగా సౌమ్య తల్లి, తండ్రులు కూడా నిస్సహాయులైపోయారు.

వెంటనే బాలిక తల్లి, దండ్రులు ఈర్ల శ్రీనివాస్, అనూరాధ జనగాం జిల్లాలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన వారు. వీరి కూతురు సౌమ్య ఊపిరితిత్తుల సమస్యతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతోంది. అనూరాధ స్వయం సహాయ గ్రూపు సభ్యురాలు కాగా తండ్రి మామూలు రైతు. ఈ నేపధ్యంలోనే ఎవరో వాళ్ళకు సీఎం ప్రజావాణి కార్యక్రమం గురించి వివరించారు. దాంతో రెండునెలల క్రితం పాపను తీసుకుని తల్లి, దండ్రులు ఇద్దరు ప్రజావాణి కార్యక్రమంలో కార్యక్రమం ఇంచార్జి చిన్నారెడ్డిని కలిసి సమస్యను వివరించారు.

బాలికకు సంబంధించిన సమస్యను వివరించి, ఇప్పటివరకు చేయించిన వైద్యం తాలూకు రిపోర్టులను చూపించారు. అలాగే ఇంకా చేయించాల్సిన వైద్యం గురించి, దాని ఖర్చుల ఎస్టిమేషన్ల గురించి కూడా వివరించారు. అంతా ఓపికగా విన్న చిన్నారెడ్డి వెంటనే స్పందించి బాలిక వైద్య అవసరాల కోసం అక్కడికక్కడే రు. 9 లక్షల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ నుండి రు. 4 లక్షలు, సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) తరపున రు. 5 లక్షలు కలిపి రు. 9 లక్షల చెక్ ను చిన్నారెడ్డి, సెర్ప్ సీఈవో దివ్యలు బాలిక తల్లి, దండ్రులకు అందించారు. ప్రజావాణి అందించిన నిధులతో సౌమ్యకు బెంగుళూరు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.

Read More
Next Story