బిఆర్ ఎస్ ను KTR బిజెపికి అమ్మేయాలనుకున్నది నిజమే....
x
BJP MP CM Ramesh and KTR

బిఆర్ ఎస్ ను KTR బిజెపికి అమ్మేయాలనుకున్నది నిజమే....

ఆంధ్రా బిజెపి ఎంపి సిఎం రమేష్ వెల్లడి


అవతలి వాళ్ళను గోకి..గోకిచ్చుకోవటం అన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బాగా అలవాటులాగుంది. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను గోకి మరీ కేటీఆర్ గోకిచ్చుకుంటున్నారు. అనకాపల్లిలోని తన ఆఫీసులో రమేష్ మీడియాతో మట్లాడుతు కేటీఆర్(KTR) కు సంబంధించిన కొన్ని విషయాలను సినిమా ట్రయలర్ లాగ బయటపెట్టారు. అవిపుడు సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండురోజుల క్రితం కేటీఆర్ మాట్లాడుతు ‘‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టుపెట్టించి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి అప్పు ఇప్పించింది బీజేపీ ఎంపీ సీఎం రమేషే’’ అని ఆరోపించారు. ‘‘అప్పు ఇప్పించినందుకు రమేష్ కంపెనీకి రేవంత్ ఫ్యూచర్ సిటీలో రు. 1665 కోట్ల రోడ్డు కాంట్రాక్టు ఇచ్చారు’’ అని చెప్పారు. బీజేపీ ఎంపీ కంపెనికి రేవంత్ కాంట్రాక్టు కట్టబెట్టడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజానికి కల్వకుంట్ల కుటుంబంతో సీఎం రమేష్(BJP MP CM Ramesh) కు అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. రమేష్ కూడా వెలమ కులస్థుడే. ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాకు చెందిన వాడు అయితే అవి ఎక్కడ, ఎప్పుడు చెడిపోయాయో తెలీదు. కెటిఆర్ చేసిన ఆరోపణతో కడుపు మండిన కేటీఆర్ ను ఆనేక ఆసక్తికరమయిన విషయాలు వెల్లడించారు. అందులో ముఖ్యమయిన బిఆర్ ఎస్ ను బిజెపికి తాకట్టు పెట్టాలనుకోవడం.

బిఆర్ ఎస్ తాకట్టుకు చర్చలు

భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) ను బిజెపి లో విలీనం చేసేందుకు కెటిఆర్ ప్రతిపాదన చేశారని, దానికి బిజెపి హైకమాండ్ అంగీకరించలేదని చెబుతూ దీనికి తానే సాక్షి అని రమేష్ చెప్పారు. అంతటి ఆగలేదు, దీనికి సంబంధించి సమావేశం తన ఇంటిలోనే జరిగిందని, వాటి సిసిటివి ఫుటేజీలు తన దగ్గిర ఉన్నాయని సిఎం రమేష్ చెప్పారు.

రమేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా పట్టున్న వ్యక్తి. కాంట్రాక్టర్ గా మొదలై ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశంలో పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందగానే నలుగురు రాజ్యసభ్యలు బిజెపిలోకి ఉడాయించారు. వారి పేర్లు అప్పటి కేంద్రమంత్రి వైఎస్ చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు.

కల్వకుంట్ల కవిత మొదటి సారి ఆరోపణ

బిఆర్ ఎస్ ను బిజెపిలో వీలీనంచేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, తాను ఢిల్లీ తీహర్ జైలులో ఉన్నపుడు తనకు ఈ విషయం తెలిసింది ఆ మధ్య కెటిఆర్ సోదరి కవిత వెళ్లడించారు. అయితే, అన్నా చెల్లెళ్ల మధ్య గొడవల్లో వెల్లడికావడంతోఎవరూ అంతసీరియస్ గా తీసుకోలేదు.అయితే, చాలా మంది అనుమానాలు మొదలయ్యాయి. కెటిఆరే ఈ పనిచేసి ఉంటారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇపుడు కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల వ్యవహారం లో నడుస్తున్న వివాదం వల్ల అనేక ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడవుతున్నాయి.

7 టాల్కటోరా రోడ్డు కోటీ లో సమావేశం

"ఢిల్లీలో తనుండే 7, టాల్కటోర రోడ్డు నివాసానికి కెటిఆర్ వచ్చాడు. తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు,తన చెల్లెలు మీద ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) కేసులను ఎత్తేయడంతో పాటు తమ ఎలాంటి కేసులు రాకుండా చూస్తే బిఆర్ ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తాం . ఈ విషయం బిజెపికి చేరవేయాలని కోరారు. నేను బిజెపి నాయకత్వానికి ఈ విషయం చెప్పాను. అయితే వాళ్లు సుముఖంగా లేరు," అని రమేష్ చెప్పారు. ఈ సమావేశం మీద ఆయన చాలా విశదంగా చెప్పారు. కెటిఆర్ తన ఇంటికి వచ్చినట్లు సిసిటివి ఫుటేజీలు ఉన్నాయని వాటిని కూడా విడదల చేస్తానని రమేష్ చెప్పారు.

"బిజెపి నాయకత్వం విలీనానాకి అంగీకరించలేదు. ‘బిఆర్ ఎస్ పీకల దాకా అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీ పని అయిపోయింది. అది పతనమవుతూ ఉంది. అలాంటి పార్టీని విలీనం చేసుకుంటే మనం కూడా మునిగిపోతాం," అని బిజెపి నాయకత్వం చెప్పింది. దానితో విలీనం ఆగిపోయింది. "నీ సంగతి నీ చెల్లెలే బయటపెట్టిందిగా,’ రమేష్ గుర్తు చేశారు. ఇది అవునో కాదో కెటిఆర్ చెప్పాలని చెబుతూ తన దగ్గిర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని వాటిని వెల్లడిస్తానని చెప్పారు.

బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనమయ్యేందుకు తాను సహకరించలేదని కేటీఆర్ తనపై కక్షపెంచుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు అని రమేష్ మండిపడ్డారు. అక్కడితో ఆగని రమేష్ ఇంకా ఏమన్నారంటే ‘‘సిరిసిల్లో కేవలం 300 ఓట్ల మెజారిటితో నువ్వు ఏ విధంగా గెలిచావో నన్ను చెప్పమంటావా’’ ? అని ప్రశ్నించారు. ‘‘తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడిని పార్టీ ఎందుకు వదిలేసుకుంద’’ని నేను అడిగితే మా పార్టీకి కమ్మ... అవసరంలేదని నువ్వు అనలేదా’’ ? అని నిలదీశారు. ‘‘రేవంత్ గెలిచిన తర్వాత తమ పార్టీలోని రెడ్లు రేవంత్ వెనకాల వెళ్ళిపోయారు కాబట్టి ఏపీలోని జగన్మోహన్ రెడ్డితోనే తమ ప్రయాణమని నాతో నువ్వు చెప్పలేదా’’ ? అని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ‘‘పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో తన దగ్గర లిస్టు ఉంది చెప్పమంటావా’’ ? అని అడిగారు. తాను మీడియాతో చెప్పిందానికి కట్టుబడి ఉంటానని కేటీఆర్ వస్తే మీడియాలోనే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రమేష్ చేసిన సవాలును కేటీఆర్ స్వీకరిస్తారా ? చూడాలి.

రమేష్ విప్పిన కేటీఆర్ గుట్టు ఇపుడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఎందుకంటే తాను జైలులో ఉన్నపుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయటానికి ప్రయత్నాలు జరిగాయని కవిత చెప్పింది నిజమే అని ఇపుడు రమేష్ సర్టిఫై చేశారు. ఇపుడేదో చెడిందని, రేవంత్ పై బురదచల్లేందుకు రమేష్ గుట్టును కేటీఆర్ బయటపెడితే మరి రమేష్ ఊరుకుంటారా? అందుకనే మీడియా సమావేశం పెట్టి కేటీఆర్ గురించి జస్ట్ ట్రయలర్ మాత్రమే వదిలారు. ఈ ట్రయలరే ఇపుడు తెలంగాణలో సంచలనంగా మారింది. అసలు సినిమా చూపిస్తే ఇంకెలాగుంటుందో ? ఇందులో నిర్మొహమాటంగా రమేష్ వెల్లడించిన విషయాలు రేవంత్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.

Read More
Next Story