‘డీలిమిటేషన్‌ను 30ఏళ్లు వాయిదా వేయాలి’
x

‘డీలిమిటేషన్‌ను 30ఏళ్లు వాయిదా వేయాలి’

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా ఉత్తరాదిలోని పంజాబ్ రాష్ట్రాలకూ నష్టం జరుగుతుందని రేవంత్ అన్నారు.


కేంద్రం సిద్ధం చేసిన డీలిమిటేషన్ ప్రణాళికలు దక్షిణాదిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. దక్షిణాది వ్యాప్తంగా రాజకీయంగా ఈ ప్రణాళికలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఖండిస్తున్నారు. తాజా దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ అంశంపై కేంద్రం సిద్ధం చేసిన ప్రణాళికలతో దక్షిణాదిపై బీజేపీకి ఉన్న కక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే బీజేపీ.. నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని విమర్శించారు. డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

‘‘దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీ సాధించినా.. బీజేపీకి వచ్చిన 240 సీట్లలో దక్షిణాదిలో వారికి వచ్చింది కేవలం 29 స్థానాలే. దక్షిణాధిలోని ఏ రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో లేదు. ఏపీలో జూనియర్ భాగస్వామిగా ఉంది. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా డీలిమిటేషన్ ప్రణాళికలు ఉన్నాయని’’ అని అన్నారు రేవంత్.

‘‘కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సక్సెస్ ఫుల్‌గా అమలు చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి డీలిమిటేషన్‌ను మరో 30 ఏళ్లు వాయిదా వేయాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ఎంతలా పెరుగుతుందో చూడాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రో రేటా విధానంలో సీట్ల పెంపు చేపట్టాలి. అలా చేస్తే యూపీలో ఇప్పుడు ఉన్న 8 సీట్లు 120కి పెరుగుతాయి. తమిళనాడులో ఉన్న 39 సీట్లు 60కి పెరుగుతాయి. కేంద్రం తీసుకొస్తానంటున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా ఉత్తరాదిలోని పంజాబ్ రాష్ట్రాలకూ నష్టం జరుగుతుంది. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి బిమారీ రాష్ట్రాలకు మాత్రమే ఈ డీలిమిటేషన్‌తో లబ్ధి చేకూరుతుంది’’ అని అన్నారు రేవంత్.

Read More
Next Story